పండుగలు Hindus festivals
పండుగలు ఏ మతం వారి కైనా వారి సాంప్రదాయం సంస్కృతిని బట్టి కొన్ని ముఖ్యమైన రోజులు పవిత్ర దినాలుగా పండగలుగా పరిగణిస్తారు.
ముఖ్యమైన పండుగలు:
- అట్లతదియ
- అనంత పద్మనాభ చతుర్దశి
- అర్ధోదయము
- అక్షయతృతీయ
- ఉగాది
- ఏకాదశి
- ఏరువాక పున్నమి
- కనుమ
- కార్తీక నక్షత్రం / కావిళ్ళ పండుగ
- కృష్ణాష్టమి / కృష్ణ జయంతి
- కోజగారి పూర్ణిమ
- గురుపౌర్ణమి
- గృహ ప్రవేశం
- గంగపండగ
- చాతుర్మాస్యము
- తిరువళ శనివారాలు
- తులసీపూజ
- దీపావళి
- నవరాత్రోత్సవము
- నాగపంచమి
- నాగుల చవితి
- నృసింహజయంతి
- పరశురామజయంతి
- పశువుల పండుగ
- బారసాల
- భీష్మైకాదశి – భీష్మాష్టమి
- భోగి
- మకరసంక్రాంతి
- మహాలయ పక్షము
- మహాశివరాత్రి
- మహోదయము
- రథసప్తమి
- వరలక్ష్మీ వ్రతము
- వసంతపంచమి
- వామనజయంతి
- విజయదశమి
- వినాయక చవితి
- వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి
- శ్రావణపూర్ణిమ – రాఖీపూర్ణిమ
- శ్రీరామనవమి
- సత్యనారాయణ వ్రతము
- సుబ్బరాయషష్ఠి / సుబ్రహ్మణ్య షష్ఠి
- సూర్యనారాయణ జన్మదినం
- సంక్రమణం
- సంక్రాంతి
- హనుమజ్జయంతి
- హోలీ.
ముఖ్య ఉద్దేశ్యం:
అసలు పండగలు చేయడంలో ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అని తెలుసుకుంటే పండగల పేరిట దేవుని స్మరించడం నలుగురు కలిసి సరదాగా భోజనం చేయడం మిగతా విషయాలు ఏవి ఆలోచించకుండా సరదాగా నలుగురితో గడపడం నలుగురు కలిసినప్పుడు కుటుంబ విషయాలు అవగాహనకు రావడం మేమున్నాము అని కుటుంబ సమస్యలకు ధైర్యం కలిగించడం ముఖ్య ఉద్దేశాలు.
శరీరం శాశ్వతం కాదు ఆత్మకు నివాసముగా శరీరం ఉపయోగపడుతుంది, ఈ జీవుడు శరీరంలో ఉన్నంతకాలం ఈ శరీరానికి అనుబంధమైన కుటుంబ సభ్యులతో సఖ్యతతో సరదాగా జీవుడుండాలి.
అధికారం చేసే కోపిష్టి తండ్రి తెలివితక్కువగా తప్పు పనులు చేసే సంతానం ఎటు తెలుసుకోలేని భార్య అన్ని మరిచి పండుగ రోజు కలిసికట్టుగా గడుపుతారు,
జిహ్వాచాపల్యం తీరడానికి పిండి వంటలు మనసుకు ఇష్టమైన రంగు బట్టలు అలంకారాలు ముచ్చట్లతో కలిసికట్టుగా కుటుంబ సభ్యులు గడిపేదే పండుగ ఊరంతా కలిసి చేసేదే జాతర నాలుగైదు ఊర్లు కలిసి చేసేది తిరునాళ్ళు, బ్రహ్మ ముహూర్తానికి 10 నిమిషాలు ముందుగా లేచి ఇల్లు శుభ్రపరచుకొని తలంటు పోసుకొని శక్తి కొలది ఆరోజు ఏ దేవుడిని పూజించాలో ఏ మంత్రం పఠించాలో ఇంటిల్లిపాది చేయాలి.
బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి 10 నిమిషాల ముందు ప్రయాణానికైనా పండుగ కైనా అదే ముహూర్తం మంచిది. కాల దోషాలు అంటవు అనగా రాహుకాలం వర్జ్యం దిక్కు రోగం ఆలోచించవలసిన అవసరం లేదు అది బ్రహ్మ ముహూర్తం విశిష్టత.
12 గంటలు భూతప్రైతముల కాలం సామాన్యంగా మిట్టమధ్యాహ్నం భూత బ్రేత పిశాచిలు బయలుదేరతాయి. పెద్దలంటారు అందుకే పండగలు పూజలు వీలున్నంతవరకు 12 గంటల లోపు పూర్తి చేసుకోవాలి.
అంటే ఉదయం ప్రారంభించి 12 గంటల లోపు చేసుకోవాలి.
దీనిని బట్టి తగులు మిగులు అన్న సమస్య రాదు.
శుభకార్య సూచన ఇది అధికమాసం ఉన్నప్పుడు నిజమాసంలో పండుగ చేసుకోవాలి.
పుణ్యం పురుషార్థం శక్తి కలిగించే క్రమ పద్ధతులు మీరు సంతోషంతో కాలం గడపాలి.
హిందువుల ముఖ్య పండుగ ?
దుర్గ దేవి నవరాత్రి అనేది హిందువుల ఆరాధన పండుగలలో ముఖ్యమైనది మరియు నృత్యానికి సంబంధించిన పండుగ. సంస్కృతంలో నవరాత్రి అనే పదానికి “తొమ్మిది రాత్రులు” అని అర్ధం.
ఈ పండుగ సందర్భంగా శక్తి రూపాలను పూజిస్తారు, అంటే అమ్మవారి రూపాలను పూజించడం, రాక్షసుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ తొమ్మిది రోజులలో, భక్తులు శక్తి కోసం తమ పూజలను అంకితం చేయడానికి ఉపవాసం ఉండి వారి ఇష్ట దైవాన్ని కొలుచుకుంటారు.
కొంత మంది సంక్రాంతి ఘనంగా జరుపుకుంటారు, ఈ పండుగను భోగి, మకర సంక్రాంతి, కనుమ అని మూడు రోజులు జరుపుకుంటారు.
ఇంకొంత మంది పెద్ద పండుగగా దీపావళిని జరుపుకుంటారు, ఈ రోజునా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
ఇలా తెలంగాణాలో ఒక విధంగా ఆంధ్రలో ఇంకో విధంగా కొన్ని తెలుగు రాష్టాలలో వారి వారి సంప్రదాయాలను బట్టి పెద్ద పండుగగా జరుపుకుంటారు.
Hindus festivals
భారతీయ పండుగలు ఏమిటి?
ఈ పండుగలు దేశం యొక్క గొప్ప వారసత్వాన్ని ఏర్పరుస్తాయి. భారతదేశంలోని ప్రధాన పండుగలలో ముఖ్యమైనవి దీపావళి, హోలీ, రాఖీ, నవరాత్రి, గురు పూర్ణిమ, ఖుభ్ మేళా, శివరాత్రి, గణేష్ చతుర్థి మొదలైనవి ఉన్నాయి.
భారతదేశంలో వివిధ జాతి వారు ఉన్న ఎవరి మనోభావాలకు హాని కలగకుండా ప్రతి జాతి వారు ఉంచ్ఛవంగా పండుగలు జరుపుకుంటారు. అందులో భాగంగానే కొందరు మాతయమైన పండుగలు కూడా కలిసి చేసుకుంటారు. అందులో ముఖ్యమైనవి రంజాన్, క్రిస్మస్.