లక్ష్మిదేవి Telugu stories II lakshmi devi story

లక్ష్మిదేవి Telugu stories

లక్ష్మిదేవి అంటేనే శుభాలను కలిగించే దేవియాని, ఒక మనిషి బతకడానికి కావలిసిన ధనం, ధాన్యం, ధైర్యం, విద్య, సంపద, సంతానం, విజయం, శుభం ఇవన్నీ ఇచ్చే జగన్మాత అష్టలక్ష్మిలుగా అవతరించిందని మన అందరికి తెలిసిందే….

ఎంతో మహిమ కలిగినా ఈ లక్ష్మీదేవి ప్రతి ఒక్కరికి ఒక ఆరాధ్య దైవం లాగా ఉంటుంది కానీ అమ్మవారి పుట్టుక గురించి దాని  వెనకాల ఉన్న కథ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. లక్ష్మి దేవి ఎంతటి కరునగలదేవినో అలాగే లక్ష్మి దేవి యొక్క కొన్ని ముఖ్యమైన కథలను  తెలుసుకుందాం.

ఒకరోజు ఇంద్రుడు ఐరావతం పైన ఎక్కి ఆకాశమార్గంలో స్వర్గానికి వెళుతుండగా పైనుంచి వెళ్తున్న ఇంద్రుడిని క్రింద ఉన్న దుర్వాస మహర్షి చూశాడు. చూడగానే అమరావతికి అధిపతి అని గౌరవంగా ఇంద్రుడిని పిలిచి తన మెడలో దండను తీసి ఇస్తాడు, కాని అప్పటికే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు అసలు దండ ఇచ్చినది ఎవరో కూడా చూడకుండా అతనిని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు కూడా తెలియచేయకుండా ఆ దండని తీసుకొని ఏనుగు తొండానికి తగిలిస్తాడు.

ఇక ఆ ఏనుగు తొండం మీద ఉన్న దండను అటు ఇటు కదిలిస్తూ ఆ దండను ఏనుగు కాళ్ళ క్రింద విసిరేసి కాలితో తొక్కుతుంది. దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ ఆ దండను అలా చూడగానే విపరీతమైన కోపం వచ్చి ఓ ఇంద్ర మితిమీరినా ని అహంకారం గర్వంతో ప్రవర్తించినా ని ఈ పనికి ని భోగభాగ్యాలు సిరిసంపదలు మొత్తం పోతాయి అని శపిస్తాడు.

శాపం తగలడంతో ఇంద్రుడు తప్పు తెలుసుకొని నన్ను క్షేమించండి అని దుర్వాస మహర్షిని వేడుకుంటాడు దానికి దుర్వాస మహర్షి శాపం వెన్నక్కి తీసుకోవడం జరగదు ఈ శాపం నువ్వు అనుభవించక తప్పదు కానీ విష్ణుమూర్తి వాళ్ళ నీవు కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందగలవు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఇంద్రుడిపైన దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం పనిచెయ్యడం మొదలైంది.

బలి నాయకత్వంలోని రాక్షసుల సైన్యం అంత అమరావతి అంటే ఇంద్రలోకం పైన దాడిచేయడం ప్రారంభించారు. ఆ దాడిలో ఇంద్రుడిని వారి పరివారం మొత్తాన్ని స్వర్గం నుండి తరిమేస్తారు. ఇక తప్పని పరిస్థితులలో ఎవరికీ కనపడకుండా అజ్ఞాతంలోకి ఇంద్రుడు వెళ్ళిపోతాడు.

ఒకరోజు తన గురువు అయినా బృహస్పతి దగ్గరికి  వెళ్లి జరిగింది మొత్తం వివరిస్తాడు. దానికి బృహస్పతి ఈ సమస్యకి పరిస్కారం బ్రహ్మను అడుగుతాము అని సలహా ఇస్తాడు. వెంటనే బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళి ఉపాయం చెప్పమనగా దీనికి సమాధానం శివుడు  ఇస్తాడు అని బ్రహ్మ చెప్తాడు.

lakshmi devi story

శివుడి దగ్గరికి ఇంద్రుడు వెళ్ళి స్వరగానికి అధికారం కోసం పరిస్కారం  చెప్పమనగా  దీనికి సమాధానం విష్ణుమూర్తి ఇస్తాడని శివుడు  చెప్తాడు ఇక ఇంద్రుడు విష్ణుమూర్తికి తన భాద చెప్పుకోగా విష్ణుమూర్తి ఇంద్రుడితో  పదవి నీకు  దక్కాలి అంటే అమృతం కావాలని చెప్తాడు అమృతం  వల్ల మృత్యువు రాదని అమృతం లభించాలి అంటే మందరపర్వతంతో సముద్రాన్ని పలుచిలికినట్టు చిలికి అమృతాన్ని బయటకు తీయాలని అలాగే ఈ పని చెయ్యడం దేవతల ఒక్కరి వల్ల సాధ్యం కాదని దీనికి రాక్షషుల సహాయం కూడా కావాలని చెప్తాడు.

క్షీరసాగర మధనం గురించి మరొక వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మంధర పర్వతం సహాయంతో వాసుకి తాడుగా ఉండి పర్వతం మునిగిపోకుండా విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉంది పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు. ఈ మధనంలో ఎన్నెనో విలువైన వస్తువులు కల్పవృక్షం కామధేనువు చంద్రుడు హాలాహలం అలాగే మహాలక్ష్మి జన్మించారు.

అయితే మహాలక్ష్మి పాలసముద్రపు మీద మీగడతో బ్రహ్మ లక్ష్మీదేవి శరీరాన్ని చేసాడట.. క్రొమ్మెఘపు మెరుపులు ఆమె మెను మెరుగుగా కుర్చాడటమహాలక్ష్మి పుట్టగానే ఆమెకి మంగళ స్నానం చేయించారు సముద్రుడు ఆమెకు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు.  విశ్వకర్మ సువర్ణ అలంకారాలు ఇస్తాడు.

మహాలక్ష్మి వైపే ఓర చూపుతో చూస్తున్న విష్ణువునీ లక్ష్మీదేవి చూసి విష్ణువు పక్కకు చేరి దేవదానవులలో మీ ఎవ్వరితో నేను చేరినా నాకు సుఖం ఉండదు. శ్రీ మహావిష్ణువు చెంత ఉంటేనే నేను నిత్యం సుమంగళిగా ఉంటాను అని చెప్పి మహావిష్ణువు మేడలో పూల మాల వేసింది. అప్పుడు సముద్రుడు కౌస్తుభమణిని అంటే అమూల్యమైన మాణిక్యం తీసుకొని విష్ణువుకి ఇస్తాడు.

ఇక విష్ణుమూర్తి ఆ కౌస్తుభమణితో పాటు మహాలక్ష్మిని తన వక్ష స్థలంపై విరాజిల్లచేసాడు.  అప్పటి నుండి మహాలక్ష్మి  విష్ణుమూర్తికి ధర్మపత్నిగా మనం కొలుచుకుంటున్నాం.

అయితే ఈ పాలసముద్రం నుండి పుట్టినా మహాలక్ష్మీనే మనం అది లక్ష్మీగా కొలుచుకుంటాం అది లక్ష్మీ అంటే మొదటి దేవత అని ఆదిలక్ష్మి రూపంలో అమ్మని కొలిచినవారికి వారి జీవిత లక్ష్యం తెలుసుకొని దానిని సాధించడానికి ఏమిచేయాలో అర్ధం చేసుకొని అనుకున్న కార్యాన్ని నెరవేర్చుకుంటారు కోరిక నెరవేరడానికి ఆదిలక్ష్మీ భౌతికమైన సంపద అందజేస్తుంది.

Telugu stories

అలాగే మథనంలో జన్మించడంతో విముక్తిని అందించడంలో అమ్మ ప్రసిద్ధి చెందింది. ఒకరోజు బృగు మహర్షి తన నిద్ర నుండి విముక్తి పొందడానికి ఆదిలక్ష్మీని వేడుకున్నాడని బృగుకి విముక్తి లభించిందిని కూడా పురాణ కథలు ఉన్నాయి. అలాగే ఈ విశ్వ అస్తిత్వం కూడా ఆదిలక్ష్మి తల్లి గర్భంలో నుండే పుట్టాయి అని పూరణ కథలు ఉన్నాయి. అలాగే ఆదిలక్ష్మీకి ఎరుపు రంగు  పువ్వులు ఇష్టం.

ఇక ధనలక్ష్మీ గురించి చూస్తే వేడుకొండల  వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర మన అందరికి తెలిసింది అయితే ఆ నాడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి పైనా అలిగి వెళ్ళినపుడు వెంకటేశ్వర స్వామికి పద్మావతిని వివాహం చేసుకునే సమయంలో ధనం లేక ఎంతో బాధ పడి కుబేరుడి దగ్గర అప్పుతెచ్చుకున్నాడు. అప్పుకి కారణం తన వద్ద ఆ నాడు లక్ష్మీదేవి లేకపోవడమే అని చెప్పుకోవాలి.

ఎవరైతే ఆర్ధిక సమస్యలతో భాద పడతారో ధనలక్ష్మీని పూజిస్తే ధనం మన జీవితం మొత్తం ఉంటుంది. చెంత లక్ష్మీదేవి లేకపోతే విష్ణువుకి కూడా అప్పు భాద తప్పలేదనే ఈ కథ వివరిస్తుంది.  ఇక్కడ ధనలక్ష్మి విశ్వంలోనే అన్ని సంపదల స్వరూపిణిగా అవతారం పొంది ఎవరైతే కష్టపడి డబ్బు సంపాదిస్తారో వారిని అనుగ్రహించి అనేకమైన సంపద సిద్దించేలాగా చేస్తుంది.

ధాన్య లక్ష్మీ పంటలు బాగా పండేలాగా  దీవించి ఆకలిని తీర్చడానికి లక్ష్మీదేవి ధాన్య లక్ష్మీగా అవతారం పొందింది. దీని వెనకాల ఒక కథ మహాభారత సమయంలో పాండవులు వనవాసం చేస్తున్నపుడు వారికీ తినడానికి ఆహారం లేక ఒండుకోడానికి ధాన్యం లేక ధాన్య లక్ష్మిని వేడుకున్నారు అప్పుడు అమ్మవారు అనుగ్రహించి వారికీ ధాన్యాన్ని ప్రసాదించింది అంతే కాకుండా మల్లి వారు ఆకలితో ఉండకుండా వారికీ ఒక చెక్క గిన్నెను ఇచ్చి నిత్యం మీకు సరిపడా ఆహారం కోసం ఈ చెక్క గిన్నె సహాయం చేస్తుంది అని చెప్పింది అలా ఆకలితో ఉన్నవారు ధాన్య లక్ష్మీని కొలుచుకుంటే ఆకలి భాదలు జీవితంలో రాకుండా అమ్మ అనుగ్రహిస్తుంది.

గజలక్ష్మి అవతారంలో ఒకరోజున గజేంద్రుడు అంటే ఏనుగు అలాగే లక్ష్మీదేవి కలిసి విష్ణువుకి పూజ చేస్తున్నారు అయితే ఏనుగు శరీరం పెద్దగా ఉండడంతో లక్ష్మీదేవి కంటే గజేంద్రుడు కాస్త నెమ్మదిగా పూజచేస్తున్నాడు అంటే విష్ణుమూర్తికి  చేసిన ప్రసాదాలు స్వామికి చేసే అలంకరణ సామగ్రి తయారుచెయ్యడం  వీటన్నిలో లక్ష్మీదేవి కంటే గజేంద్రుడు వెనకపడ్డాడు.

అప్పుడే గజేంద్రుడు విష్ణు అనుగ్రహంలో లక్ష్మీదేవి కంటే వెనక ఉంటానేమో అని గ్రహించి లక్ష్మీదేవిని వేడుకుంటాడు. అమ్మ నేను నిదానంగా ఉన్నను నాకు సహాయం చేయమని కోరుకుంటాడు. అప్పుడు లక్ష్మీదేవి కరుణించి గజలక్ష్మిగా అవతరించింది. ఈ అవతారం కొలిచిన వారికీ ఆహారం కోసం ఎవరైతే పశువుల పెంపకం పైన ఆధారపడతారో అట్టి వారికీ జీవితం గడవడానికి మొగప్రాణుల మీద ఆధారపడిన వారికీ గజలక్ష్మి అనుగ్రహించి కోరిన కోరిక తీరుస్తుంది.

అలాగే ఈ అవతారంతో మోగ జీవులు లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో తెలియచేస్తుంది.  మూగజీవులను హింసించే వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు.

సంతాన లక్ష్మి మనుషులకు సంతానం కలగడానికి లోకంలో జీవులు పెరగడానికి లక్ష్మీదేవి ఈ సంతాన లక్ష్మీగా అవతరించారు అయితే ఇక్కడ సంతాన లక్ష్మికి పూజ చేసినవారికి సంతానం కలుగుతుంది అంతేకాకుండా ఆరోగ్య కరమైన పిల్లలు మంచి గుణం మంచి జీవితం పిల్లలకు ఉంటుంది.

ధైర్యలక్ష్మి పూర్వం బోజరాజన్ అనే ఒక రాజు లక్ష్మీదేవికి మహాభక్తుడు అయితే ఈ భక్తుడిని పరీక్షించడానికి స్వయంగా లక్ష్మీదేవినే బోజరాజన్ కలలో కనిపించి అష్టలక్ష్మీలలో ఏడుగురు లక్ష్మీలని నీ రాజ్యం నుంచి పంపించాలి అని ఎవరైనా ఒక్క లక్ష్మిని మాత్రమే ని రాజ్యంలో ఉంటుంది అని ఏ లక్ష్మీ నీ రాజ్యంలో ఉండాలో నువ్వే ఎంచుకో అని చెప్తుంది.

అయితే అప్పుడే బోజరాజన్ ధైర్య లక్ష్మీని తన రాజ్యంలో ఉండేలాగా ఎలాంటి పరిస్థితిలో కూడా ధైర్యం నా ప్రజలు నిను కొల్పకూడదు అని కోరుకున్నాడు. ధైర్యం లేనిదీ సంపాదన లేదు భయంతో జీవితమే ఉండదు అని గ్రహించిన బోజరాజన్ కి ధైర్య లక్ష్మీ అండగా ఉంది రాజ్యం ప్రజవిల్లింది. ధైర్యలక్ష్మిని కొలుచుకుంటే ప్రజలకి ధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

విద్య లక్ష్మి అజ్ఞానంగా ఉన్న ప్రజలలో జ్ఞానం నింపడానికి లక్ష్మీదేవి ఈ అవతారం ఎత్తారు నిజానికి జ్ఞానం వల్లే సంపద విలువ ఎలా బ్రతకాలి, నలుగురిలో ఎలా ఉండాలి  అనే  తెలుస్తుంది విద్యాలక్ష్మిని కొలవడం వల్ల ప్రజలలో జ్ఞానోదయం అవుతుంది.

విజయ లక్ష్మి కష్టసమయాలలో  మనుష్యులకు సహాయం చేయడానికి విజయ లక్ష్మి అవతరించింది. కేవలం యుద్దరంగంలోనే కాదు మనిషి జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురుకోవలిసి వస్తుంది అట్టి సందర్భాలలో విజయం కోసం విజయ లక్ష్మిని కొలుస్తారు.

అష్టలక్ష్ములే కాకుండా లక్ష్మీదేవి విష్ణుమూర్తి ప్రతి అవతారాలలో తన ధర్మపత్నిగా అవతారం పొంది ఎన్నెనో కష్టాలను అనుభవించింది అందుకే లక్ష్మీదేవిని ఎవరు కొలిచినా ఐశ్వర్యంతో పాటు సౌభాగ్యం కూడా లభిస్తుంది.

ఇక లక్ష్మి అమ్మవారిని శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో కొలుచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మంగళవారాలు లక్ష్మీని కొలుచుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి వ్రతం చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే దీపావళి రోజునా అమ్మని ఆరాధిస్తే అపురూపమైన ఫలితం ఉంటుంది.

అమ్మవారి జీవిత చరిత్ర శ్రావణమాసంలో వినడం వల్ల అమ్మ అనుగ్రహం లభించి డబ్భుకి పేరుకి సౌభాగ్యం అష్టఐశ్వర్యాలు లభిస్తాయి ధన్యవాదాలు.

Leave a Comment