Spiritual stories దరిద్ర దేవత ఇంట్లో ఎందుకు ఉంటుంది, mythology stories

దరిద్ర దేవత ఇంట్లో ఎందుకు ఉంటుంది:

ప్రతి ఒక్కరికి కావలిసింది ధనం అంటే డబ్బు ఈ డబ్బు ఉంటె అన్ని ఉన్నట్టే మరి డబ్బు ఎలా వస్తుంది అంటే ఎవరి కష్టం వారిది సంపాదించే కొద్దీ ధనం వస్తుంది కానీ మన హిందువులకు డబ్బు ఉంటె మన దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే అని నమ్ముతారు.
ఎంత సంపాదించిన కూడా డబ్బు అనేది నిలవదు అలాంటి పరిస్థితులలో ముందుగా ఎందుకు ఈ దరిద్రం నా వెంటనే ఉంది అని చాలా మంది భాద పడతారు. అష్ట ఐశ్వర్యలు ఇచ్చే లక్ష్మి దేవిని మనమే మన ఇంటి నుండి వెళ్ళగొడుతున్నామని కొంత మందికి తెలీదు.

సిరి సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని మనం నిత్యం చేసే పనుల ద్వారా లక్ష్మీదేవికి బదులుగా జేష్ఠ దేవిని పిలుస్తున్నాము ఇంతకీ లక్ష్మీదేవి మన నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిపోతుంది లక్ష్మికి బదులు దరిద్ర దేవత ఎందుకు ఇంట్లోకి వస్తుందో మీకు తెలుసా…
లక్షిదేవి ఇంట్లో నుండి వెళ్ళడానికి దరిద్ర దేవత ఇంట్లోనే ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

కారణాలు:

ఐశ్వర్యాన్ని కలిగించే లక్ష్మి దేవి స్థానాలు కాకుండా మిగతావన్నీ దరిద్ర దేవత స్థానాలే.

1. శుభ్రత లేకుండా ఉన్న చోట్లన్ని దరిద్ర దేవత నివాసాలు,
2. గుమ్మానికి పసుపు రాయకుండ అలా వదిలేస్తే అది దరిద్ర దేవత నివాసం,
3. ఇంట్లో చెడు వాసనలు వచ్చినా అది దరిద్ర దేవత ఇంట్లోకి వస్తున్నట్లు,
4. అలాగే బట్టలు మూటలు మూటలుగా ఎక్కడ పడితే అక్కడ ఉన్న అది దరిద్ర దేవతకు చాలా ఇష్టం
5. ఇల్లు ఎప్పుడు చిందర వందరగా ఉన్న దరిద్ర దేవత ఇష్టపడుతుంది,
ఇలా సూచి శుభ్రత లేని వారి ఇంట్లో దరిద్ర దేవత ఆ ఇంట్లోనే నివాసం ఏర్పర్చుకుంటుంది.
లక్ష్మి దేవి ఎవరైతే తన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారో వారి ఇంట్లోకే వెళుతుంది వారికే సిరి సంపదలు కురిపిస్తుంది.

”Spiritual stories”’

దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా ఉండడానికి చేయవలిసినా పనులు :

• దరిద్ర దేవి ఇంట్లో నుండి బైటకు వెళ్ళడానికి మీరు చెయ్యవలిసినా ముఖ్యమైన పని నిద్రలేవగానే భగవంతుడిని నామం తలుచుకొని భూమాతకు నమస్కారం చేసి, ఏ పని చేయకుండా మీ బాత్రూమ్ గది తలుపు తెరిచి ఉంచాలి.
• ఆ తరువాత మీ ఇంటి ముఖద్రారం తలుపు లేదా గేట్ తియ్యాలి, ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బైటికి వెళ్ళిపోతుంది.
• ఆ తరువాత నిద్రలేవగానే దంతాలను శుభ్రం చేసుకోవాలి,
• కొంత మంది నిద్ర నుంచి లేచి ఇంట్లో పని అంత చేసి వారి పిల్లలను బడికి పంపినా తరువాత నిదానంగా పళ్ళు తోముకుంటారు, అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోనే ఉంటుంది.
• కాబట్టి నిద్రలేవగానే బాత్రూమ్ తలుపులు తీసి ఇంటి ముఖద్వారం తీసి వెంటనే పళ్ళు తోమాలి.

ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి వారానికి ఒక్కసారైనా సాంబ్రాణి పొగ వేస్తూ ఉండాలి అప్పుడే ఇంట్లో ఉన్న దరిద్ర దేవి పొయ్యి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది.

”Spiritual stories”’

త్రిపురాదేవి కథ

Leave a Comment