కైలాస దర్శనం shiva story II telugu stories

కైలాస దర్శనం shiva story II telugu stories

కోరగానే వరాలిచ్చే దేవుడు, అడంభారాలు లేని దేవుడు ఎవరు ఎలా పూజ చేసిన స్వీకరించేవాడు, కేవలం తన నామస్మరచేసిన కరుణించే దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే వెతకకా ముందే గుర్తుకు వచ్చే దేవుడు శివుడు మాత్రమే. 

ఇక శివుడికి సంబంధించిన ఎన్నో ప్రసిద్ధి దేవాలయాల్లో అతి  ముఖ్యమైనవి  అందరికి గుర్తుకు వచ్చేది కాశీ,  కైలాసం మరి ఈ రెండిటిలో అతి కష్టమైనా దర్శనం ఏది అంటే అది కైలాస దర్శనం మాత్రమే.  అలాంటి కైలాస దర్శనం ఈ అమ్మవారి గుడిలో నుండి దర్శించుకోవచ్చు అంటే ఎంతో విచిత్రం. అసలు ఎవరు ఈ అమ్మవారు ఏంటి ఈ కైలాస దర్శన రహస్యం.

పొహ్లానీ మాత

పూర్వం హిమాచల్ ప్రదేశ్ లోని రాఖేడ్ గ్రామ ప్రదేశంలో రాక్షస సైన్యం పుట్టి ఎంతో వినాశం చేశారు వారి అరాచకాలకు అమాయకమైన ప్రజలు భలి అవ్వడం చూసి అక్కడే  పార్వతీదేవి కాళికామాత అవతారం నుండి పొహ్లానీ మాతగా అవతరించి రాక్షస సంహారం చేసింది. 

ఆ తరువాత  పొహ్లానీ మాత  2755 మీటర్ల ఎత్తుగల కొండా పైన వెలసింది  ఉంది. అక్కడినుండి అమ్మ భక్తులకి దర్శనమిస్తుంది. అయితే ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది ఈ ఆలయం నుంచి కైలాస పర్వతం కనిపిస్తుంది అని అక్కడే నివసించే భక్తులు చెప్తుంటారు

కైలాస దర్శనం

నిజానికికైలాస పర్వతంటి బెట్సరిహద్దులలో హిమాచల్పర్వతశ్రేణుల్లో కలిసి ఉంది  కైలాస పర్వతం ఈ పొహ్లానీ మాత గుడికి చాలా దూరం అంటే దాదాపుగా అమ్మ వారి గుడికి కైలాసానికి 524 km అనేచెప్పుకోవాలి

ఇంత దూరం ఉన్న ఈ కైలాసం పొహ్లానీ మాత గుడిలో నుండి కనపడడం మహా అద్భుతం మరి ఇది నిజమైనా అని కొంత మంది వారి ఉత్సహం కొద్దీ కనుకోవడం మొదలు పెట్టారు ఎన్నో కష్టాలు పడి అమ్మవారి గుడికి చేరుకొని అక్కడ చూపించిన గుర్తుల ప్రకారం చూస్తే దట్టమైన మంచు వల్ల మొదట్లో గుర్తించలేక పోయినా తరువాత వారికీ కైలాస పర్వతం దర్శనం ఇచ్చింది కానీ హిమాచల్ శిఖరాలలో ఒక దిక్కున కైలాస పర్వతం ఉంటె ఇంకో దిక్కున ఈ శిఖరం కనిపిస్తుంది ఏది నిజమో వారికీ తెలియక ఆ గుడి పూజారిని అసలు విషయం అడిగారు.

నిజానికి అది కైలాస పర్వతం కాదు అది మణిమహేష్ అనే కైలాస శిఖరం ఇక్కడే చాలా మంచికి తెలియని ఒక రహస్యం దాగి ఉంది ఈ మణిమహేష్ అనే శిఖరం పంచ కైలాసాలలో ఒకటి నాకు తెలిసి కైలాసం ఒక్కటే కదా అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే మొత్తం కైలాసాలు 5 ఉన్నాయి మొదటిది ఆది కైలాసం ఇది ఉత్తరాఖండ్ లో ఉంది రెండోవది  కైలాష్ మౌంట్ మానససరోవరం టిబెట్ దగ్గర, మూడోది మణిమహేష్ నాలుగు కిన్నర్ కైలాష్ ఐదు శ్రీఖండ్ పర్వతం ఈ మూడు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నయి.

telugu stories

ఈ ఐదు కైలాస శిఖరాలలో ప్రసిద్ధి చెందింది ఎన్నెనో వింతలతో కూడింది టిబెట్ సరిహద్దుల్లో ఉన్న కైలాస పర్వతం అయితే ఇక్కడ పొహ్లానీ దేవి గుడి నుండి కనిపిస్తున్న ఈ మణిమహేష్ కైలాస శిఖరం మీద శివుడే స్వయంగా నివసిస్తాడని పురాణ కథలు ఉన్నాయి

మౌంట్ కైలాసం మీద శివుడు 6 నెలలు ఉంటె మిగతా 6 నెలలు ఈ మణిమహేష్ శిఖరం పైన ఉంటాడంట అంతే కాకుండా ఈ మణిమహేష్ కైలాస పర్వతం పైన పార్వతి దేవిని వివాహం చేసుకున్నాక చాలా కాలం పాటు నివసించారు ఈ మణిమహేష్ కైలాసాన్ని చేరుకోవడం కూడా అతి కష్టమైనా పని ఎందుకంటే అక్కడ ఉండే మంచు వల్ల ఈ పర్వతం పూర్తిగా కనిపించదు కేవలం కృష్ణాష్టమి నుండి రాధాష్టమి వరకు అక్కడ ఉన్న మంచు తొలగి మణిమహేష్ కొండా పూర్తిగా కనిపిస్తుంది చాలా చాలా తక్కువ సమయం మాత్రమే ఈ పర్వతం దర్శనం ఇస్తుంది

అలాంటిది పొహ్లానీ మాత గుడిలో నుండి ఈ శిఖరాన్ని చూడడం అనేది విశేషం ఏందో మహిమ ఉంటె కానీ మనకు ఆ దర్శనం దక్కదని చెప్పుకోవాలి అయితే ఇక్కడ చెప్పొకోదగిన మరొక విశేషం ఏంటి అంటే మణిమహేష్ కొండా మీద గొర్రెల కాపరి బొమ్మలు ఉంటాయి అంట అలాగే అక్కడ బ్రాహ్మణి దేవి అనే పుణ్యక్షేత్రం ఉంది ఆ బ్రాహ్మణిని నది రూపంలో కూడా మనకు దర్శనం ఇస్తుంది ఆ నదిలో స్నానం చెయ్యడం వల్ల స్వర్గా ప్రాప్తి లభిస్తుంది అని పాపాలు నశిస్తాయి అని పూర్వ జన్మ పాపాలు కూడా పోతాయి అని చెపుతారు.

ఇంతకీ ఈ పొహ్లానీ దేవి గుడి నుంచి మణిమహేష్ శిఖరానికి ఎంత దూరం అంటే 60.9 km ల దూరం అంతే కాకుండా పొహ్లానీ కొండా చుట్టూ అనేకమైన ఎతైన కొండలు ఉన్న మణిమహేష్ పర్వతం సృష్టాంగా కనిపించడం అద్భుతమనే చెప్పాలి. అసలు మణిమహేష్ పర్వతం ఎక్కడి నుండి ఎందుకు అంతే స్పష్టంగా కనిపిస్తుంది అంటే  పూర్వం పొహ్లానీ మాత రాక్షస సంహారం చేసినప్పుడు అమ్మవారికి శివుడు సహాయం కావలిసి వచ్చింది దాని వల్ల శివుడు ఈ మణిమహేష్ పర్వతం నుండే పొహ్లానీ మాత దగ్గరకు వచ్చి సహాయం చేశాడు అని అక్కడి పూజారి వివరించారు.

మనకు తెలిసిన శివుడి కథల కంటే మనకు తెలవని శివుడి కథలే ఎక్కువ అని ఈ పొహ్లానీ గుడి గురించి వినే నేపథ్యంలో తెలుస్తుంది. ఇలాంటి శివుడి కథలు మరిన్ని మీకు తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్చేసి నాకు తెలియచేయండి

Leave a Comment