moral stories in telugu వానరులే యుద్ధం ఎందుకు చేశారు:
రామాయణంలో వానర జాతినే ఎందుకు రాముడు సహాయం అడిగాడు దానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం…
రామాయణంలో పాల్గొన్న వానరసేన మొత్తం దేవతల అవతారాలే రామాయణం ప్రారంభం అవుతున్న సమయంలో విష్ణువు ఒక అవతారం ఎత్తడానికి ఎన్నో ఏర్పాట్లు ముందుగానే జరిగిపోతాయి, అందులో ముఖ్యమైన ఘట్టం పూర్తి అవ్వడానికి నారాయణుడే స్వయంగా కొంత మందిని పుట్టించాడు అందులో మొదట చెప్పుకోవాలిసింది వానర సైన్యం.
ఈ వానర సైన్యాన్ని నారాయణుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి అప్సర గర్భంలో, గాంధర్వ రాజుల గర్భంలో తనకు రామ అవతారంలో సహాయపడడానికి పుట్టించమని అడిగాడంట.
అలాగే దేవతలకి ఉన్న బలం కొడుకులుగా పుట్టే వానరులకు ఉండాలని చెప్పాడంట దాని కారణంగా బ్రహ్మ వానరులను పుట్టించాడు.
అందుకే రామాయణంలో ఉండే వానరులకి దైవ శక్తులు ఉంటాయి సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీలుడు ఇలా ఎన్నో వేలమంది, దేవుళ్ళు, వానరాలుగా అవతరించారు.
అందరికంటే ముఖ్యమైన వానరం హనుమాన్ ఈ హనుమాన్ సాక్షాత్తు శివుడి అంశ.
Moral stories in telugu
వానర రూపమే ఎందుకు ?
- అప్పటికే రావణుడికి శివ భక్తి తగ్గి అహం పెరుగుతున్న సమయంలో మనుష్యులను చాలా అంటే చాలా చులకనగా చూసేవాడు అలాంటిది మునుష్యులు చులకనగా చూసే వానరులతో యుద్ధం అంటే రావణుడు మరింత చులకనగా చూసి రాముడు ఏ ప్రయత్నం చేసినా లెక్క చేయకుండా ఉంటాడు వానరులను పట్టించుకోడు అందుకోసమే.
- రాముడు రాజ్యాన్ని విడిచి వెళ్ళాక రాముడికి తిండిని కూడా అడిగాని సైన్యం కావాలి, అయితే వానరులకి కేవలం చెట్లు చెట్లకి పండ్లు ఉంటె చాలు అవి తినే ఉండగలవు కనీసం వానర సైన్యానికి దుస్తువులు కూడా అవసరం లేదు, అలాగే రావణాసురిడి లాగా అహంకారం అస్సలు లేదు సరికదా ఎంత అవమానాన్ని అయినా అవి భరించగలవు.
- అలాగే బంగారం లాంటి విలువైన వస్తువుల మీద వాటికీ ఆశ ఉండదు, అందుకే రావణాసురిడి లంకలో బంగారం ముద్దలు కుప్పలుగా ఉన్న హనుమంతుడు అతని సైన్యం వాటిని ద్వాంసం చేశారే గాని ఆశించలేదు. అంటే బంగారం విలువ తెలిసినా వారు వారి కోసం దాచుకోవడం రావణుడితో ఒప్పదం చేసుకోవడం చేస్తారు వానరులు అలా ఆశపడరు కాబట్టి వీరి వల్ల సమస్యలు ఉత్పన్నం కావు.
- జటాయువుకి ఉండే ఎగిరే శక్తి మృగాలకు ఉండే పరిగెత్తే శక్తి ఒక్క ఈ వానరంలో ఉంటుంది. ఈ రెండిటితో ఒక్కేసారి ఆకాశంలో ఎగిరి లక్ష్యం ముందు దూకగలవు.
- వీటితో యుద్ధం ముగిసాకా రాజనీతితో గాని యుద్ధ ధర్మంతో గాని వచ్చే ప్రశ్నలకి సమాధానంగా వానరులతో యుద్ధమే నేరం అని అలా చేసినా వాటిని ధర్మబద్ధం కాదని వాదించే వీలు లేదు.
- కోట్ల సంఖ్యలో వానరులు వచ్చినా అంత మంది వానర సైన్యానికి ఆయుధాలు అందించే అవసరం లేకుండానే కేవలం వాటి గోళ్లు, కోరెలే వాటి ఆయుధాలుగా ఉంటాయి.
- కోతి చనిపోయినా అంత్యక్రియలు జరిపారు, కేవలం మనుస్యులకి మాత్రమే అంత్యక్రియలు ఉంటాయి.
- లంకవరకుసముద్రంలోదుకేశక్తికేవలంవానరులకుమాత్రమేఉంటుంది.
- అన్నిటికంటే ముఖ్యమైనది నందీశ్వరుడు రావణాసురుడికి శాపం ఇచ్చాడు ఆ శాపం ప్రకారం వానరులు రావణాసురిడి వధలో సహాయం చెయ్యాలి.
- పెద్దపెద్దమృగాలతోయుద్ధంవిద్యలునేర్పిఅంటేఏనుగు, గుర్రం, సింహం, పులి వంటి జంతువులకి యుద్ధ విద్యలు నేర్పి యుద్ధం చెయ్యొచ్చు కానీ అల్లరి చేష్టలు చేసే కోతులకి యుద్ధ విద్యలు నేర్పి యుద్ధం చేపియ్యడం కేవలం రాముడికి మాత్రమే సాధ్యం.
Moral stories in telugu
రావణాసురుడికి పైకి వానరులే అని తక్కువ జాతి చెందినవి నన్ను ఏమి చెయ్యలేవు అనుకుంటాడు, లోపల దైవ శక్తిని కలిగినా వానరులతో రావణాసురిడి సైన్యాన్ని వధించొచ్చు అనే కారణాలతో వానర జాతే సరియైనది అని విష్ణు మూర్తి భావించి వానరులను పుట్టించాడు.
ఇక రామాయణంలో వానరుల ప్రతాపం అంత ఇంత కాదు హనుమంతుడు చేసినా యుద్ధం అతనితో పాటు కొన్ని కోట్ల వానరులు చేసినా యుద్ధం ఆ నాడు సీతాదేవి రావణుడి భారీ నుండి తప్పించ గలిగింది.