moral stories in telugu
కార్తీక సోమవారం కథ:
ఒకరోజు జనక మహారాజు వశిష్ట మహర్షిని కార్తీక మాసంలో ఏ పూజ అయినా ఎందుకు అంత విశేషమైన ఫలితం ఉంటుంది దానికి కారణాలు ఏమిటి అని అడిగాడు.అప్పుడు వశిష్ఠు మహర్షి జనకుడితో సోమవారాల వ్రతం గురించి అలాగే కార్తీక మాసంలో ఎలాంటి పూజ చేయకుండా ఉన్న వారి గురించి వివరిస్తాడు పూజ గురించి చెప్పి కొన్ని కథలు కూడా జనకుడి చెప్తాడు
శివుడికి కార్తీకమాసంలో వచ్చే సోమవారాలు ఎంతో ఇష్టం ఈ రోజునా ఆడవారు గాని మగవారు గాని రోజంతా ఉపవాసం ఉండి నదిస్నానం చేసి వారివారి సోమతాల కొలది ధన ధర్మాలు చేస్తూ నిష్ఠతో శివుడికి బిల్వ పాత్రలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్రదర్శనం చేసిన తరువాత వారు ఉపవాసం విడవాలి
ఆ రాత్రి జాగారం చేస్తూ పురాణంలోని శివుడి కథలు వింటూ ఆ మరుసటి రోజునా మల్లి నది స్నానం చేసి పేదవారికి అన్న దానం చెయ్యాలి ఆలా చెయ్యలేని వారు ముగ్గురు బ్రాహ్మణులకి అన్నదానం చెయ్యాలని ఆలా చేస్తే శివలోకానికి చేరుకుంటారని వశిష్ఠుడు జనకుడి వివరించాడు
. అంతే కాదు ఈ కథ భర్తలేని వితంతవు సోమవారం వ్రతముణ్ణి చేసినైన, లేక శివ పూజ చేసిన కైలాస ప్రాప్తి లభిస్తుందని అలాగే విష్ణువుని పూజించిన కూడా వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని చెప్తాడు. దానికి ఉదాహరణగా ఈ కథ వివరించాడు వశిష్ఠ మహర్షి.
పూర్వం కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, అతడు పూజారి వృత్తిలోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండే వాడు, అతడికి చాలా రోజులా తరువాత ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు స్వాతంత్ర నిష్టురి, ఈమె పెరిగి పెద్దయ్యాక ఆమె తండ్రి మిత్రశర్మ అనే ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు.
ఈమిత్రశర్మవేదాలనుచదువుతూమంచిబుద్దితో, అన్ని శాస్రాలలో మంచి జ్ఞానం కలిగి ఉన్నాడు. ఇతడు నిత్యా సత్యవాది. భగవంతుడి నామస్మరణతో ఉండేవాడు, ఈథాని భార్య అయినా నిష్టురి యవ్వన గర్వంతో ఎల్లపుడు భర్తను తిట్టుకుంటూ, కొన్నిసార్లు కొట్టుకుంటూ గట్టిగ గయ్యాళిలాగా అరిష్టు పరాయి పురుషుల మీద ఆశపడుతూ వ్యభిచారం చేస్తూ ఉండేది.
తన వంశాన్ని పాడుచేస్తున్నందుకు ఆమె అత్త మామలు ఇంటినుండి వెళ్లగొట్టినా తన భర్త మాత్రం ఇంత నీచమైన పని చేసినా ఛీపో అనకుండా ఆమెతోనే కాపురం చేస్తూ ఉన్నాడు. కానీ చుట్టుపక్కల ఆమె చేసే పనులకు గయ్యాళి అని ఆమెకు కర్కశ అనే పేరు పెట్టారు.
ఇలాకొత్తకాలంగడిచాకఒకరోజురాత్రిఈకర్కశతనభర్తనిద్రపోతున్నసమయంలోనాకుభర్తనేఅడ్డుగాఉన్నాడనిఆమెమెల్లగాలేచిదయాదాక్షణ్యాలులేకుండాఒకబండరాతినితెచ్చిఆమెభర్తతలపైనగట్టిగాకొట్టింది. వెంటనే ఆ మిత్రశర్మ చనిపోయాడు.
ఆ మృతు దేహాన్ని ఎవ్వరి సహాయం తీసుకోకుండానే ఒక్కతే రహస్యంగా దొడ్డి దారిలో గొంపోయి ఊరి చివరున్నా పాడుపడ్డ బావిలో వేసి దానిపైనుండి చెత్త చెదారం వేసి ఏమి తెలియనట్లుగా ఇంటికి వచ్చింది.
ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ తనతో ఉన్న ఆడవారిని కూడా చెడకొడుతూ మగవారిని వశపరుచుకుంటూ ఉంది కొన్ని సంవత్సరాల తరువాత ఆమె యవ్వనం కొంచెం కొంచెం తగ్గుకుంటూ వచ్చింది.
తనశరీరంఅంతపదవుతూకుష్టివ్యాధితోభాదపడతుదేహంనుండిచీమురక్తంకారుతూఆమెనుండిచేదువాసనలువాస్తుఉంది. యవ్వనంతో ఉన్నపుడు ఎంతో మందితో ఉన్న ఈమెను ఇప్పుడు ఎవ్వరు మొఖం కూడా చూపియ్యడం లేదు. ఆలా కొన్ని రోజులకి ఆమె చనిపోయింది.
moral stories in telugu…
ఆమె బ్రతికి ఉన్న రోజులన్నిటిలో ఒక్క రోజు కూడా పురాణాలను వినడం కానీ చదవడం కానీ చేయలేదు. చనిపోయినవెంటనేఆమెనుభయంకరమైనయమాభటులువచ్చిఆమెనుతీసుకొనిపోయియమధర్మరాజుముందునిలబెట్టారు
యముడు చిత్రగుప్తుణ్ణి చేత ఆమె పాపాలు విని భటులరా ఈమెకు ఎర్రగాకాల్చిన ఇనుప స్తంభాలకు కట్టబెట్టు అని చెప్పారు వెంటనే భటులు ఈ నిష్టురిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలను కౌగిలించుకోమన్నారు, భర్తను బండరాతితో చంపినందున ఇనుప గాథలతో యమభటులు కొట్టారు, పతివ్రతలు వ్యభిచారులు చేసినందుకు సలసల కాగే నూనెలో వేశారు.
ఆలా ఎన్నెనో శిక్షలు సీసం కరిగించి చెవిలో పోశారు, ఇనుపకడ్డీలతో వాతలు పెట్టారు, కుంభిపాకమనే నరకంలో వేస్తే అందులో ఉన్న పాములు, తేళ్లు, జెర్రీలు, కాకులు విషసర్పాలు కరిచాయి, ఈమె ఒక్కతి పాపం చేస్తే ఎటు ఏడూ తరాల వారు అటు ఎదుతరాల వాళ్ళు కూడా శిక్షలు అనుభవిస్తున్నారు.
ఇలా నరక భాధను అనుభవించి చివరకు కళింగ దేశంలో కుక్కగా జన్మెతింది ,ఆ జన్మలో ఆకలి బడా పడలేక ఇల్లులు తిరుగుతూ కుక్కని కట్టెలతో కొట్టేవారు కొడుతూ, తిట్టేవారు తిడుతూ తరిమేవారు తరుముతూ ఉండగా ఒకనాడు ఒక శోత్రియ బ్రాహ్మణుడు, కార్తీకసోమవారం వ్రతం చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రదర్శనం చేసి, భలి అన్నం అరుగుపైన పెట్టి కాళ్ళుచేతులు కడుకోవడానికి వెళ్ళాడు.
ఆ సమయంలో ఈ కుక్క వచ్చి ఆ భలి అన్నం తిన్నది. వ్రతం నిష్టగా చేసుకున్నందుకు, ఆ బ్రాహ్మణుడి పూజ విధానం చేత పూజ బలిఅన్నమ్ అవ్వడం వాళ్ళ ఆ ఇల్లు శివ పూజ స్థానం అయినందున ఆ ఇంట్లో దొరికిన ప్రసాదం కాబట్టి, ఆ ప్రసాదం కుక్క తినడం వల్ల కుక్కకి మాటలు వచ్చాయి.
వెంటనే ఆ శునకం ఓ బ్రాహ్మణా నన్ను కాపాడు, కాపాడు అని మొత్తుకుంది. దానితో ఈ బ్రాహ్మణుడు బైటకు వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు కుక్క తప్ప. దానితో మల్లి లోపలికి వెళ్లిన బ్రాహ్మణుడికి రక్షించు రక్షించు అని వినిపించింది.
దానితో మల్లి బ్రాహ్మణుడు వచ్చి ఎవరు నీవు కుక్కవి నీకు ఎలా మాటలు వచ్చాయి నీ కథ ఏంటి అని అడిగాడు. దానికి ఈ నిష్టురి అయినా కుక్క నేను 15 జన్మల క్రింద ఆడదానిగా పుట్టి, వ్యభిచారం చేస్తూ, కట్టుకున్న భర్తను చంపి, ముసలితనంలో కుష్టి వ్యాధితో బాధ పడి చనిపోయాక యముడి దగ్గర నానా నరకయాతన పడి ఈ జన్మలో ఇలా కుక్క లాగా పుట్టి ఆకలికి తట్టుకోలేక మనుషులు తిడుతూ, కొడుతూ ఉంటె పాడుకుంటూ నీ గుమ్మం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న అన్నం తిన్నాను, అని చెప్తుంది.
వెంటనేఆబ్రాహ్మణుడుఈరోజు కార్తీక సోమవారం వ్రతం చెయ్యడం దాని వల్ల వచ్చిన బలిఅన్నం తినడం వాళ్ళ ఈ కుక్కకి మాటలొచ్చాయి. అని ఆ బ్రాహ్మణుడు గ్రహించి ఈ బ్రాహ్మణుడు ఒక సోమవారం వ్రతంలో ఉన్న పండును ఆ కుక్కకి ఇచ్చాడు.
అంతే వెంటనే ఆకాశంలో నుండి ఒక అద్భుతమైన పుష్పకవిమానం వచ్చి చుట్టూ ఉన్న వారు చూస్తుండగానే శివ భటులు ఆ కుక్కని శివలోకానికి అంటే కైలాసానికి తీసుకొని పోయారు.
ఇలా కార్తీక సోమవారం వ్రతం చేసుకొని వారు శివలోకం చేరుతారని కనీసం వ్రతం చేసున్న వారి దగ్గర ఆశిశులు తీసుకొని ప్రసాదం తీసుకున్న శివలోకం చేరుతారని వశిష్ఠ మహర్షి జనక మహర్షికి చెప్పాడు.
అలాగే కార్తీక మాసం గురించి మరొక కథ వశిష్ఠుడు సీతాదేవి తండ్రి గారైన జనకుడికి వివరిస్తున్నాడు. కార్తీక మాసంలో ఏ చిన్న దానం చేసిన సకల ఐశ్వర్యంతో ఉంటారని అలాగే ఎవరికైనా కుదరక పోతే కనీసం కార్తీక పౌర్ణమి నాడు తలస్నానం చేసి శివుడిని పూజించిన శివలోకానికి వెళతారని ఆలా కాకుండా అవినీతితో ఏ దానం చేయకుండా కార్తీక స్నానం చేయకుండా ఉన్న వారు వచ్చే జన్మలలో కుక్కలుగా, కోడిగా, పిల్లిగా పుడతారు అని చెప్పి ఉదాహరణగా ఈ కథ చెప్తాడు.
మన భారతదేశంలో దక్షణ దిక్కున ఒక గ్రామంలో మహా విద్వాంసుడు, తాపశాలి, జ్ఞానం కలిగిన వ్యక్తి సత్యం పలుకుతూ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడు తీర్ధయాత్రలు చేస్తూ గోదావరికి బయలుదేరాడు.
అలా పోతుండగా కొంత దూరంలో ఒక వటవృక్షం ఉంది ఆ వటవృక్షం పైన భయంకరమైన ముఖంతో పెద్ద పెద్ద కోరలతో నల్లని రంగులో పెద్ద పొట్టతో, చూసేవారికి అతి భయంకరంగా కనిపిస్తూ ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తున్నారు ఆ రాక్షసులు దారిన పోయేవారిని బెదిరిస్తూ భయపెడుతూ ఆకలి ఉన్నపుడు వారినే తింటూ ఉండేవారు.
అయితే ఎలా తీర్ధ యాత్రలకు వస్తున్న ఈ బ్రాహ్మణుడు ఆ వృక్షం దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్లేసరికి యథావిధిగా ఈ బ్రహ్మ రాక్షసులు క్రిందికి వచ్చి అతనిని చంపబోయారు, అదే సమయంలో ఈ బ్రాహ్మణుడు ఆ భయంకరమైన రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమి తోచక నారాయణ స్తోత్రాన్ని గట్టిగ చదివాడు.
ప్రభు ఆపదలో ఉన్న గజేంద్రుడని ఎలా అయితే రక్షించావో, నిండుసభలో ద్రౌపదిని, చిన్న బాలుడైన ప్రహ్లాదుడిని రక్షించిన విధంగానే నన్ను ఈ రాక్షసుల దాడి నుండి రక్షించు బ్రభు అని ఆర్తనాదాలు చేస్తున్నాడు.
నారాయణ ప్రార్ధనలు వినగానే ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులకి జ్ఞానోదయం అయ్యింది. వెంటనే ఆ బ్రాహ్మణుడిని ఏమి చేయకుండా ప్రార్ధనలు ఆపండి మహానుభావా నారాయణుడి నుండి రక్షించండి అని ఆ రాక్షసులు వేడుకున్నారు వెంటనే ఈ బ్రాహ్మణుడు ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకొని, మీరు ఎవరు ఎందుకు ఎలా రాక్షసులు రూపంలో ఉన్నారు మీ కథ ఏంటో తెలుపమన్నాడు.
ఓ బ్రాహ్మణా నీవు పుణ్యాత్ముడవు, వ్రతనిష్ఠ కలిగిన వారు, ధర్మం తెలిసిన వారు మీ దర్శనం వల్ల నాకు పూర్వజన్మ జ్ఞానం కొత్త కలిగింది అని ముగ్గురు రాక్షసులలో మొదటి వ్యక్తి మాట్లాడుతూ
నినుపూర్వజన్మలోద్రావిడదేశంలోఒకబ్రాహ్మణుడనునేనొకమహాపండితుడనిగర్వంతోన్యాయాన్యాయాలుఆలోచించకుండాపశువులాగాప్రవర్తించి, బాటసారుల వద్ద అమాయకపు ప్రజల వద్ద దౌర్జన్యంగా డబ్బు లాక్కొని, అందరిని అవమానిస్తూ ఉండేవాడిని ఒకరోజు కార్తీక మాసంలో వ్రతం చేసుకొని ఒక బ్రాహ్మణుడు మా ఇంటికి అతిధిగా వచ్చాడు,
కానీ నేను ఆ పండితుడిని అవమానించి కొట్టి తన దగ్గర ఉన్న దనం వస్తువులు తీసుకొని మా ఇంటి నుండి గెంట్టేసాను, అందుకు ఆ పండితుడికి కోపం వచ్చి నీచుడా అన్యాయంగా డబ్బు కూడబెట్టింది సరిపోక మంచిచెడ్డలు ఆలోచించకుండా తోటి బ్రాహ్మణుడనే ఆలోచన కూడా లేక నన్ను కొట్టి తిట్టి గెంటేసావు.
నీవు ఒక రాక్షసుడవు అయ్యి నరభక్షకుడవు అయ్యి నిర్మానుష ప్రదేశంలో తిరుగుతూ ఉంటావు అని శపిస్తాడు. వెంటనే నేను క్షేమపానాలు కోరుకోక గోదావరి సమీపంలో ఒక వటవృక్షం మీద నీవు నివసిస్తూ ఉంటే కార్తీకవ్రతం ఆచరించిన ఒక బ్రాహ్మణుడి అటు వచ్చి అతని వాళ్ళ నీకు మరల నే రూపం నీకు వచ్చి పునర్జన్మ పొందుతావు అని చెప్పాడు.
ఇప్పడు మీ వల్ల నాకు జ్ఞానోదాయం అయ్యింది ఎలాగైనా నాకు ఈ రాక్షస రూపం నుండి విముక్తిని ఇవ్వండి అని ప్రార్ధ్యపడ్డాడు.
moral stories in telugu
వెంటనే మరొక బ్రహ్మరాక్షసుడు ఆ బ్రాహ్మణుడుతో, నేను కూడా పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడనే నేను కూడా నీచమైన మనుషుల సావాసం చేసి తల్లిదండ్రులని బాధపడుతూ వారికీ తిండి పెట్టకుండా వారి ముందే నా భార్య పిల్లలతో పంచావక్ష పరమాన్నం తినేవన్నీ.
ధన ధర్మాలు చేయకుండా నా బంధువులను కూడా హింసించి రాక్షసుల లాగా ప్రవర్తించినందుకు నాకు రాక్షసుడిలాగా పుట్టాను, ఎలాగైనా నన్ను ఈ పాపం నుండి ఉద్ధరించు అని వేడుకుంటున్నాడు.
ఇక మూడో బ్రహ్మరాక్షసుడు ఓ మహాశయా నేను ఒక సంపన్న కుటుంభంలో పుట్టాన బ్రాహ్మణుడను, నేను విష్ణు ఆలయాలలో అర్చకుడిగా ఉండేవాడిని కానీ స్నానం కూడా చేయకుండా మాసిన బట్టలతోనే దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని.
విష్ణువుకి దూపం, దీపం పెట్టకుండా భక్తులు తెచ్చినా ఆభరణాలను నా ఉంపుడుగతేకు ఇచ్చేవాడిని, అంతేకాకుండా మద్యం మాంసం తిని దేవాలయానికి వెళ్ళేవాడిని ఆలా పాపకార్యం చేసినందుకు ఈ జన్మలో ఇలా బ్రహ్మరాక్షసుడిలాగా పుట్టాను అని ఎలాగైనా నన్ను పాపం నుండి బయటపెట్టు అని వేడుకుంటాడు.
ఇక వశిష్ఠులు జనకుడితో కార్తీక మాసం వ్రతం చేసుకున్న ఆ బ్రాహ్మణుడు ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులని మీరు పూర్వ జన్మలో చేసిన పాపం వాళ్ళ మీకు ఈ గతి పట్టింది అని మీరు నాతో రండి అని వారిని తీసుకొనిపోయి ఈ బ్రాహ్మణుడే స్వయంగా రాక్షసుల విముక్తి కోసం గోదావరిలో స్నానం చేసి తన పుణ్యఫలమును ఆ ముగ్గురికి ధారపోసాడు.
వెంటనే వారి రాక్షస రూపం పోయి దివ్యరూపాలు ధరించి వైకుంఠానికి వెళ్లారు. అయితేఇక్కడ వశిష్ట మహర్షి జనక మహర్షితో ఎవరైతే కార్తీక మాసంలో గోదావరి స్నానం చేస్తారో హరిహరులు సంతృప్తి చెంది సకల ఐశ్వర్యం, అనుగ్రహం ప్రసాదిస్తాడు అని చెప్పాడు.
ఇలా బ్రహ్మరాక్షసుల కథ పూర్తి అయ్యాక జనకుడు వశిష్ఠులని ఒక ప్రశ్న అడుగుతూ మహానుభావా అసలు కార్తీక మాసాన ఎవరిని ఎలా పూజించాలి అని అడిగాడు, దానికి వశిష్ఠులు దీపారాధన అతి ముఖ్యమైనది, శివకేశవులకు దీపారాధన చాలా ఇష్టమని సూర్యాస్తమయం లేదా
చీకటి పడే టైములో శివకేశవుల సన్నిధిలో దీపారాధన చేస్తే సర్వపాపాలు పోయి వైకుంఠాన్ని చేరతారని చెప్తూ ఆవునెయ్యితో గాని, కొబ్బరినుండితో గాని, విప్పనూనెతో, గాని ఏది దొరకకపోతే అమ్ముదాంతో కానీ దీపారాధన చేయాలి అని చెప్తాడు. అలాచేసిన వారిలో ఒక పుణ్యమూర్తి కథను ఇలా వివరిస్తున్నాడు.