సుబ్రహ్మణ్యేశర స్వామి Hindu temples
తమిళనాడు అనగానే చాలా మందికి మురుగన్ అనే గుర్తొస్తుంది ఎందుకంటే తమిళనాడులో సుబ్రహ్మణ్యేశర స్వామిని ఎంతో భక్తితో కొలుచుకుంటారు కాబట్టి, అలాగే చాలా మహిమ గల దేవాలయాలన్నీ తమిళనాడులోనే కొలువై ఉన్నాయనే చెప్పుకోవాలి, అయినా తమిళనాడులో ఎన్నెనో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్న కేవలం మనకు మురుగన్ అనే ఎక్కువగా వింటూవుంటాం అసలు అంత గొప్ప మహిమ నిజంగా మురుగన్కి ఉందా…
మనకు తెలియని ఎన్నో వింతలలో ఈ కథ కూడా ఒకటి, తిరుచందూర్ ఆలయం దగ్గర సునామి కూడా వెనక్కి వెళ్ళిపోయినా సందర్భం 2004 లో జరిగింది. ఇప్పుడు నేను చెప్పే ఈ కథ ఒక యదార్ధ సంఘటన ఆ సంఘటన ఏంటో దాని వెనక ఉన్న కథ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.
తిరుచందూర్
తమిళనాడులోని తిరుచెందూర్ ఆలయం దగ్గర బ్రిటిష్ వారు ప్రజలపై దాడి చేసి మన సంపదను విలువైన వస్తువులను తీసికొని బ్రిటన్ కి సముద్ర మార్గం నుండి వెళదాం అని వారు దోచుకున్న సంపదను మొత్తం ఒక పడవలో పెట్టుకొని వెళుతున్నారు.
అయితే వారు తీసుకొనిపోతున్న సంపదలో కొన్ని విగ్రహాలు బంగారం, వెండి అలాగే పంచలోహంతో చేసినవి, బ్రిటన్ కి తీసుకొని వెళుతున్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళు పడవ ఎక్కే ముందు వాతావరణం మాములు గానే ఉంది, కానీ వాళ్ళు పడవ ఎక్కి ప్రయాణం మొదలుపెట్టిన కొద్దిసేపటికి సముద్రంలోని అలలు వేగంగా వస్తున్నాయ్ హఠాత్తుగా తుఫాన్ లాంటి వర్షం మొదలైంది , వారికీ ఏమి అర్ధం కావట్లేదు ఇంత హఠాత్తుగా ఎలాంటి సూచనలు లేకుండా ఇంత భారీ వర్షం ఎలా వస్తుందో తేలడం లేదు.
పడవలోని ఒక నావికుడు పడవలో ఉన్న కార్తికేయుని విగ్రహం చూసాడు దాన్ని చూసి ఆ నావికుడు బ్రిటిష్ వారితో మీరు ఏ విగ్రహాన్ని తెసుకొని వస్తున్నారో తెలుసా ఈ పంచలోహంతో ఉన్న కార్తికేయుడే ఈ వాతావరణం కలిపించాడు ఇలాగే ఈ విగ్రహాన్ని బ్రిటన్ కి తీసుకొని వెళ్లేలోపే ఈ పడవ ఇక్కడే మునిగిపోతుంది మనం అందరం చనిపోతాం అని బ్రిటిష్ వారికీ ఆ నావికుడు చెప్పాడు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి తిరుచెందూర్ ఈ ఒక్క దేవాలయం మాత్రం సముద్రతీరంలో ఉంది.
అంతేకాదు దీనికి చాలా పురాతనమైన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు ఈ దేవాలయం గురించి చెప్పే అంత సమయం లేదు ముందు ఈ విగ్రహాన్ని నీటిలోకి వెయ్యండి. లేకపోతే మనం అందరం ఇక్కడే చనిపోతాం అని ఆ నావికుడు అంటాడు. ఇక బ్రిటిష్ వారు ఆ తుఫాన్ చూసి బయపడి, ఆ నావికుడు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని సముద్రంలోకి విడిచిపెట్టారు.
సముద్రంలోకి విగ్రహం వెళ్లిన వెంటనే తుఫాన్ ఆగిపోయింది. సముద్రం కూడా చాలా ప్రశాంతంగా కనిపిచింది. ఇక బ్రిటిష్ వారు బ్రిటన్ కి వెళ్లిపోయారు.
moral stories in telugu
ఆ తరువాత కొన్ని రోజులకి ఆ గుడి పండితుడికి, ఒక కల వచ్చింది. అందులో సుబ్రహ్మణ్యేశర స్వామి కనిపించి, నేను సముద్రంలో 10km ల దూరంలో ఉన్నానని నా విగ్రహాన్ని వెనక్కి తీసి మళ్ళి తిరుచెందూర్ గుడిలో ప్రతిష్టించామని, చెప్తాడు. అప్పుడు కలలోనే పూజారి, స్వామి నిన్ను సముద్రంలో నేను ఎలా గుర్తించగలను, నీవు సముద్రం అడుగుభాగానా ఉంటావ్ కదా అని అడుగుతాడు.
అప్పుడు సుబ్రహ్మణ్యేశర స్వామి నేను ఉన్న చోట నిమ్మకాయలు తేలుతూ మీకు కనిపిస్తాయి, ఎక్కడైతే సముద్రం పైన మీకు నిమ్మకాయ కనిపిస్తుందో అక్కడ మీరు సముద్రలోకి దిగి చూడామణి సుబ్రహ్మణ్యేశర స్వామి వెళ్ళిపోతాడు. ఇక పూజారి తెల్లవారగానే కొంత మందిని తీసుకొని సముద్రంలోని పడవలో వెతకడం మొదలు పెట్టారు.
సముద్రం ఒడ్డుకి 10kms దూరంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉండడం చూసారు, దానితో ఆ నిమ్మకాయ ఉన్న ప్రదేశంలో దూకి విగ్రహాన్ని చూసి అక్కడినుండి, విగ్రహాన్ని బయటకి తీశారు. ఆ విగ్రహానికి ముఖం కనపడకుండా, చేపలు ఉన్నాయి ఆ చేపలు స్వామి కళ్లు, ముక్కు, నోరు మొత్తం కలిసి పోయేలాగా విగ్రహం మీద దాడి చేస్తున్నట్టు ఉన్నాయి.
విగ్రహం నుండి వచ్చే మెరుపుకి ఆ చేపలు అలా ముఖం మొత్తం ఉన్నాయి. ఆ తరువాత ఆ విగ్రహాన్ని పూజారి తీసుకొనివచ్చి తిరుచెందూర్ ఆలయంలో ప్రతిష్టించారు. ఇప్పటికి ఆ విగ్రహం తిరుచెందూర్ దేవాలయం లో భక్తులకి దర్శనమిస్తుంది.
అంతేకాదు సుబ్రహ్మణ్యేశర విగ్రహాన్ని బయటికి తీసి ప్రతిష్ట చేసిన తరువాత తిరువాయిదురై మఠంలో ఉండే దేశికామూర్తికి కూడా స్వామి కలలో కనిపించి, తనకు 9 అంతుస్తుల రాజా గోపురం కట్టమని చెప్పాడంట,దానితో దేశకామూర్తి ఆలయం కట్టాలని అనుకున్నాడు కానీ పేదవాడు కావడంతో, ఎవరైతే పనిచేసే కూలీలకు స్వామి విభూధిని పంచేవాడు.
ఆ పనివారు కొద్దీ దూరం వెళ్లేసరికి ఆ విభూది బంగారు బిళ్ళలుగా మారేది. దానితో ఆ కూలివాళ్ళు స్వేచ్ఛగా వచ్చి ఆలయం కట్టడానికి పనిచేసేవారు. ఆలా ఆలయం నిర్మించారు. అప్పటి నుండి స్వామివారి విభూధికి చాలా మహిమ ఉందని అందరూ భావిస్తారు, ఆ విభూదిని ఇంట్లో ఉంచిన, నుదిటిపైనా ధరించిన ఆపదలు అనారోగ్యాలు పోతాయని భక్తుల నమ్మకం.
అలాగే ఇక్కడ చెప్పుకోవాలిసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే 2004 డిసెంబర్ 26న తమిళనాడులో సునామి వచ్చిందని మన అందరికి తెలిసిన విషయమే ఈ సునామి కారణంగా తమిళనాడులో సముద్ర తీరానికి కొన్ని మైళ్ల దూరం వరకు అన్ని ప్రదేశాలు సునామి వల్ల జలమయం అయ్యి ఎంతో నష్టం వచ్చింది.
moral stories in telugu
కాని సముద్ర తీరానికి ఇంత దగ్గరగా ఉన్న తిరుచెందూర్ దేవాలయంకి ఏ హాని జరగలేదు, అంతేకాకుండా ఈ ఆలయం నుంచి 2kms వరకు నీరు వెనకు వెళ్లిందని చెప్తారు. ఈ ఆలయానికి సముద్రం వాళ్ళ నీటి వాళ్ళ ఎలాంటి హాని కలగదని ఆ ఆలయంలో ఉండే శిలాశాసనాల మీద రాసి ఉన్నటు చెపుతారు. ఇది సుబ్రహ్మణ్యేశర స్వామి మహిమగా అక్కడి ప్రజలు చెప్తుంటారు.
అసలు ఇక్కడ ఈ ఆలయం ఎలా స్థాపించబడిందని చూస్తే, తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసులని చంపడానికి కుమారస్వామి వెతికే timeలో కుమారస్వామి, శివుడిని ఈ ప్రదేశంలోనే పూజించాడు. కుమారస్వామి తరకాసురుడిని, చంపినా తరువాత, సూరపద్మం అనే రాక్షసుడు ఈ ఆలయంలోనే మర్రిచెట్టుగా ఉన్నాడు, అది తెలుసుకున్న కుమారస్వామి ఆ మర్రిచెట్టును రెండు భాగాలుగా ముక్కలు చేశాడు.
చివరి క్షణాలలో అసురుడు కోరిన కోరిక వాళ్ళ ఆ మర్రిచెట్టు రెండు భాగాలూ ఒకటి నెమలిగా, ఇంకో భాగం కోడిగా ఏర్పడినాయి వాటిని కుమారస్వామి వాటిని వాహనాలుగా చేసుకున్నాడు, ఆ తరువాత కుమారస్వామి ఈ ఆలయంలో కొలువై ఉండి భక్తుల కోరికలు తిరుస్తున్నారని చెప్పవచ్చు.
తిరుచందూర్ ఒక్క ఆలయమే కాదు సుబ్రమణ్యేశ్వర స్వామికి చెందిన మహిమ గల దేవాలయాలు చాలా ఉన్నాయి అందులో స్వయంగా స్వామినే వెలిసిన దేవాలయాలు 7 ఉన్నాయి అందులో ఒకటి తిరుచందూర్. కార్తికేయుడి గురించి మీకు మరిన్ని కావాలనిపిస్తే కామెంట్ బాక్స్ లో నాకు తెలియచేయండి.