కణిక నీతి Moral stories in telugu II Bhagavatham

దృతరాష్ట్ర మహారాజు కణికుడి కథ Moral stories in telugu 

హస్తినాపురానికి రాజుగా ఉన్న దృతరాష్ట్ర మహారాజు ముగ్గురు మంత్రులని నియమించుకున్నాడు అందులో మొదటి వ్యక్తి ప్రధాని మీ అందరికి తెలిసిన విదురుడు ఈ విదురుడు ధర్మమూర్తి, నీతికలవాడు, విధ్వంసుడు. రెండొవ వాడు సంజయుడు ఈయన రాయభారి విషయాలు కార్యాలు నిర్వహిస్తూ దృతరాష్టుడికి సలహాదారుడిగా ఉంటాడు, ఇక మూడో వ్యక్తే కణికుడు  ఈ కణికుడు క్రూరమైన బుద్ది కలిగి మోసంతో కుట్రలతో శత్రువులని ఎలా నాశనం చెయ్యాలో చెప్పగలిగేవాడు.

అయితే ఈ కణికుడు ఇతని కుటిల నీతి ఏంటోఒకసారి తన మహారాజు అయినా దృతరాష్టుడితో చెప్పాడు ఆ కథనే ఈ వీడియోలో తెలుసుకుందాం

కణిక నీతి

మహారాజ అనగనగా ఒక మహా అరణ్యం అందులో ఎన్నెనో క్రూరమైన మృగాలు సాధారణంగా జీవిస్తున్నాయి, ఆ అడవిలోనే ఒక నక్క ఉంది. అది చాలా తెలివైనది.

ఈ నక్క తన పనులన్నీ ఇతరులతో చేపించుకొని తన పని పూర్తి కాగానే వాటిని మోసం చేసి వచ్చినా ఫలితాన్ని హాయిగా అనుభవిస్తుంది. ఈ నక్కకి నలుగురు స్నేహితులు ఉన్నారు, పులి, తోడేలు, ముంగిస, ఎలుక అయితే ఈ నలుగురితో కలిసి మెలిసి ఉన్నట్లు నటిస్తూ హాయిగా జీవిస్తుంది ఈ నక్క. అయితే ఒకరోజు బాగా లావుగా ఉంది నిగనిగలాడుతూ హాయిగా గంతులేస్తూ చెంగుచెంగున దూకుతూ పోయే లేడి ఈ నక్క కంటపడింది.

ఆ లేడి ఈ మిత్రబృందాన్ని దూరంనుంచే చూసింది, వెంటనే దానికి అనుమానం వచ్చి చాలా దూరం పారిపోయింది. కాని ఈ నక్కకు ఆ లేడిని తినాలనే కోరిక కలిగింది. ఈ నక్క ఎంత ప్రయత్నం చేసినా దానిని పట్టుకోవడం మాత్రం సాధ్యం కావడం లేదు. బాగా ఆలోచించింది దాని మిత్రులను అందరిని చుట్టూ కుర్చోపెట్టుకుంది. ఆ తరువాత నక్క వాటితో స్నేహితులారా ఆ లేడి ఎంత అందంగా ఉందో దాని మాసం అంత రుచిగా ఉంటుంది.

కానీ దానితో పరిగేతే శక్తి మాత్రం మనలో ఎవ్వరికి లేదు. కాబట్టి దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు. కాకపోతే  మనం అందరం ఒక కుట్ర పన్ని దాన్ని చంపొచ్చు. అప్పుడు హాయిగా దాన్ని మాంసం మనం తినొచ్చు అని నాలుకని చరిచింది అంటే అది ఎంత రుచిగా ఉంటుందో అని చూపించింది, వెంటనే వీటన్నిటికీ నోరు ఊరింది. దానితో అవి ఆ ఉపాయం ఏంటో నువ్వే చెప్పాలి మిత్రమా అని అడిగాయి.

అది కొద్దిసేపు ఆలోచిస్తున్నట్లు నటించి ఆ నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది మీరంత జాగ్రత్తగా వినండి అంటూ ఈ లేడి మెలకతో ఉంటూ తిరుగుతుంటే దానిని మనం పట్టలేము అందువల్ల ఇది అలసిపోయి హాయిగా నిద్రపోతున్న సమయంలో చప్పుడు చేయకుండా పాకుతూ పోయి ఈ ఎలక భావా దాని కళ్ళు కొరకాలి. అదే అదునులో పులి దాని మెడ పట్టుకొని విరిచేయాలి, అంతే అని నక్క అన్నది.

Moral stories in telugu

నక్క తెలివికి  ఎంతో సంతోషించాయి. ఇక ఈ లేడి నిద్రపోయే సమయం కోసం ఈ నక్క, పులి, ఎలుక, ముంగిస, తోడేలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. కొద్దిసేపటికి అడవిలోని గడ్డితిని సెలయేరులో నీరు తాగి చెంగుచెంగున గంతులేసి అలసిపోయి విశ్రాంతి కోసం కళ్ళు చాపి నిద్రపోతుంది.

ఇక నక్క సలహా ప్రకారంగానే ఈ చిట్టి ఎలుక ఆ జింక కళ్ళు కొరికింది, అది బాధతో లేవబోతుండగానే ఈ పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మీద కొరికేసింది. అంతే లేడి చనిపోయింది. ఇక నక్కతో పాటు దాని స్నేహితులు నలుగురు సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నారు.

ఇకనక్కస్నేహితులారాఇంతరుచిగలమాంసంమనందరంహాయిగాతినాలి, కానీ మీ శరీరాలన్నీ దుమ్ము దూళితో ఉన్నాయి, అందువల్ల ఆ కొండలోయలో సెలయేటికి వెళ్లి స్నానం చేసి రండి అప్పుడు తినొచ్చు అంతలో ఇక్కడ నేను కాపలాగా ఉంటాను అంది. ఆ నాలుగు సంతోషంతో స్నానానికి వెళ్లాయి అందరికంటే ముందుగా పరుగు పరుగున పులి వెళ్లి వచ్చింది, ఈ నక్క పులి ముందు దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంది.

అది చూసినా పులి భావా ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది దానికి ఈ నక్క ఎలుక లేదు అది ఏమన్నాడో తెలుసా ఈ పులి ఎంత పెద్ద జంతువు అయినా ఏమి లాభం నేను కళ్ళు కొరికితే కాని అది ఏమి చేయలేక పోయింది నా తెలివితో ఏ పులి చచ్చినా లేడిని తినడానికి వస్తుంది, కొంచం కూడా రోషంలేదు ఆ పులికి అని వేళాకోళం చేసింది,  ఎలుక ఆ అంటుంటే నాకు ఎంతో భాద కలిగింది పులి బావా అని నక్క కన్నీరు కరుస్తుంది. వెంటనే ఈ పులికి కోపం వచ్చి మిత్రమా ఎలక నా కళ్ళు తెరిపించింది.

ఈ రోజు నుండి నా శక్తితోనే నా తిండిని నేను సంపాదించుకుంటాను ఒకరిమీద నేను ఆహారపడను అని అక్కడ నుండి వెళ్లిపోయింది. అంతలోనే ఎలుక అక్కడికి వచ్చింది విన్నావా ఎలుక ఈ లేడిని పులి ముట్టుకుంది కాబట్టి ఇది విషంతో నిండిందని దీనిని నేను తినను ఆ ఎలుకను తినేస్తా అని ముంగిస ని కోసం వస్తుంది అని చెప్తుంది వెంటనే ఈ ఎలుక కన్నంలోకి దూరిపోయింది.

ఆ తరువాత తోడేలు అక్కడికి వస్తుంది విన్నావా మిత్రమా ని మీద పులికి కోపం వచ్చిందంట నిన్ను తినేయడానికి తన భార్యతో కలిసి తింటాడంట అని నక్క చెప్పడంతో ఈ తోడేలు పరుగు తీసింది.

కొద్దిసేపటికి ముంగిస వస్తుంది దానితో చూడు ముంగిస నీవు చాలా ఆశతో వచ్చావు అనుకుంటా నేను పులిని, ఎలుకని, తోడేలు ని చంపి దూరంగా పడేసాను, నీకు నన్ను ఓడించే భలం ఉంటె నాతో పోరాడి ఈ లేడి మాంసం తిను అని అంటుంది, ఈ ముంగిస అంత గొప్ప విరులనే ఓడించావు నా వాళ్ళ కాదని తోక ముడుచుకొని వెళ్లిపోయింది. ఆ తరువాత ఈ నక్క హాయిగా ఆ లేడి మాంసం తిన్నదని కణికుడు దృతరాష్టుడికి చెప్తాడు.

Moral stories in telugu

ఈ కథ పూర్తి అయినాక విన్నారా మహారాజా నక్క తెలివితో, వంచనతో, కుట్రలతో ఎలా అయితే నక్క తన పనులని కార్యాలని ఎరవేర్చుకుందో అదేవిధంగా ఈ కురు వంశం కోసం మనకు అనుగుణంగా మన తెలివితో వంచనతో కుట్రలతో అయినా సరే మన కార్యాలను మనం నెరవేర్చుకోవాలి. అని కణికుడు దృతరాష్టుడితో చెప్పాడు దీనినే కణిక నీతి అంటారు.

అయితే ఈ కణికుడు కుటమైన నీతిని భోధించడంలో మహా ఘటికుడు ఈ దృతరాష్టుడి మూడో మంత్రి అయినా ఈ కణికుడు మొదటగా శకుని మంత్రిగా అన్ని మరికొన్ని గ్రంధాలలో కణికుడు శకుని పుత్రుడని వివరించారు ఎలా అయితే శకుని మాయమాటలు చెప్పి కౌరవులని నాశనం చేశాడో కణికుడు కూడా తన కుట్రతో కుటమైన నీతితో దృతరాష్టుడూకి రాజనీతిలో ఏ విధంగా మోసం చేయొచో నేర్పించాడు. అందులో కొన్ని ఎప్పుడు మీరు వినండి.

శత్రువు ఎంత వేడుకున్నా విడిచిపెట్టకూడదు, ఎదో ఒక ఉపాయంతో శత్రువుని నాశనం చేయాలి. చిన్న తప్పే కదా అని అనుకోకూడదు, అది మన గురువైన, పుత్రుడైనా మిత్రుడైనా, తండ్రి అయినా మీకు ఎంత ఆత్మీయుడైనా శత్రువు స్థానంలో ఉండే వారిని తప్పకుండా చంపేయాలి, అలాగే చిరునవ్వుతో మాట్లాడుతూనే వారిని దెబ్బతీసి తరువాత అతడి కోసం ఏడవాలి, అందరిని అనుమానిస్తూ ఉండాలి అన్ని పనులు చాలా రహస్యంగా చెయ్యాలి, ఆదేవింధంగా వారికీ దండం పెట్టి చేతకాని వారిలాగా ఉంటె శత్రువులు లొంగరు, చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టాలి.

ముందుగా అన్ని విధాలుగా వారిని నమ్మించి ఆ తరువాత తోడేళ్ళు మీద పడ్డట్లుగా శత్రువులా మీద పడి నాశనం చెయ్యాలి. అవసరమైతే శత్రువుని కొంతకాలం పాటు మన భుజాల మీద మొయ్యాలి. శత్రువు ఎంత దినంగా వేడుకున్న విడిచిపెట్టొద్దు సామ, దాన, బేధ దండోపాయాలు ప్రయోగించి శత్రునాశనం చెయ్యాలి అని కుటమైన నీతిని ఈ కణికుడు దృతరాష్టుడికి బోధిస్తాడు.

ఈ కనికా నీతి కారణంగానే ద్రౌపతి వస్త్రాపహరణం సమయంలో ఈ దృతరాష్ట్ర మహారాజు మౌనంగా ఉన్నాడు  అంతే కాకుండా దుర్యోధనుడు శకుని ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని పాపాలు చేసినా తన సింహాసనం కోసం పదవి కోసం ధర్మం ఎటు పోయినా నాకు సంభంధం లేదని మౌనంగా ఉన్నాడు కణికుడు నేర్పినా కాణికా నీతి చివరికి తన రాజ్యంతో పటు నూరుగురు పుత్రులని కూడా కోల్పయేలాగా చేసింది. కాబట్టి చెడు తలిచిన వాడికి చెడె జరుగుతుందని మహాభారతం మనకు తెలియజేస్తుంది ధన్యవాదాలు.

Leave a Comment