కనుమ రోజు పాటించే విధి విధానాలు:
ఈ భోగి సంక్రాంతి కనుమ పండుగలు ముఖ్యంగా సూర్యదేవుడి కలగమనానికి సంబంధించిన పండుగ అయితే కాలచక్రానికి అది అంతం లేనిదీ అయినప్పటికీ ఎదో ఒక రోజు కొత్త సంవత్సరం ప్రారంభించాలి.
కాబట్టి హిందువులంతా ఉగాదితో నూతన సవచరం ప్రారంభిస్తారు
పురాణాలు మనం క్లుప్తంగా గమనిస్తే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ధనస్సు రాశిలో ఉండే సమయాన్ని సంచారాన్ని పూర్తి చేసుకొని మకరరాశిలో ప్రవేశిస్తూ ఉత్తరాయణంలోకి సూర్యగమనం వస్తదని వివరించడం జరిగింది
అయితే ఈ సమయం దేవతలందరికీ సూర్యదయాన్ని సూచిస్తుంది అంటే ఎప్పుడైతే ఉత్తరాయణంలోకి సూర్యుడు వెళతాడో అప్పటి నుంచి దేవగణాల ఒక రోజులో పగలు రాత్రి ఎలాగో దేవుళ్ళకి పగలు ఈ సమయంలోనే వస్తుంది.
అలాగే కర్కాటక రాశి గమనం వరకు సూర్యుడు ఉంటాడు అయితే ఈ కాలంలో ఎప్పుడైతే కనుమ వస్తుందో ఆ రోజునా ఈ నియమాలు పాటిస్తే రానున్న రోజులన్నీ మనకు అనుకూలంగా ఉంటుంది.
kanuma roju cheyavalisina panulu
విధి విధానాలు :
1. పశువులను పూజించడం. కనుమ రోజు పశువులకు ఇష్టమైన పచ్చిగడ్డి, నవధాన్యాలు నీటిలో నానబెట్టి ఆహారంగా అందచేయడం, అలాగే ఏదైనా పశువుల పాకలో పొంగలి వొండి చిన్న పిల్లలకు ప్రసాదంగా పంచి పెట్టడం జంతువులను ప్రేమగా చూస్తూ ఒకవేళ ప్రసాదం మిగిలితే అటువంటి పొంగలిని పశువులే కాకుండా ఇంకా వేరే ఏదైనా మొగప్రాణులకు అందించాలి.
2. అలాగే ఏదైనా ఆటలతో ఆరోజు ఆనందంగా గడపడం
3. ఎలాంటి ప్రయాణాలు చేయకుండా ఉండడం
4. ముఖ్యంగా 5 రకాల కూరగాయ ముక్కలను పులుసులాగా చేసుకొని ఇంటిల్లిపాది తినడం
5. మన హిందూ ఆచారాల ప్రకారంగా సజ్జ రొట్టెలు కనుమ రోజు ఆహారంగా తీసుకోవడం వీటితో పాటుగా ఈ రోజు ఇంటికి వచ్చిన అల్లుళ్లకు మర్యాద గౌరవంతో కొత్త బట్టలు అందించడం
ఈ కనుమ రోజు కుంటుంబంతో సంతోషంతో గడపడం చెయ్యాలి
Note: ఈ websiteలో ప్రతి పండుగ గురించి అలాగే రోజు చేయవలిసి పూజలు పరిహారాలు నియమాల గురించి అదే విధంగా మన తెలుగు గ్రంధాలు పురాణాలు రామాయణం భారతాలలో ఉండే నిహి వాక్యాలు గురించి అదేవిధంగా ఎవరికీ తెలియని అమ్మవారి మహిమల గురించి ఎంతో పరిశోధన చేసి మీ వరకు తీసుకొస్తున్నాం. మీకు ఆసక్తి ఉంటె గనుక ఈ website ని follow అవ్వండి ధన్యవాదాలు