ఉదంకుడు కథ Moral stories in telugu
పూర్వం ఉదంకుడనే ఒక వ్యక్తి ఉండేవాడు ఇతను పైలముని దగ్గర గురుకులం చేస్తూ విద్య నేర్చుకుంటున్నాడు, అయితే ఇతను గురువు ఏది చెప్పినా విని నిష్టగా ఉంటూ అష్టసిద్దులు పొందాడు, శిష్యుడు మీద నమ్మకంతో ఈ పైలా ముని ఒకేసారి ఇల్లు ఇళ్ళనిని శిష్యుడు మీద వొదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళాడు
తిరిగి వచ్చేకా ఉదంకుడి నిష్ఠకు తాను గృగాన్ని గురుపత్నిని ఎంతో జాగ్రర్తగా చేసుకున్నందుకు పైలుడికి ఎంతో సంతోషం కలిగి ఇక ని విద్యాభ్యాసం పూర్తి అయ్యింది ఇక నీవు వెళ్లి పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా ఉండు అని అంటాడు
ఈ ఉదంకుడు గురువు చెప్పినట్టు వింటూ నిను మీకు గురు దక్షణ ఇవ్వాలని కోరికగా ఉందని పైలుడితో అంటాడు దానికి పైలముని నాకు గురు దక్షణ వొద్దు నీకు అంతగా ఇవ్వాలి అనిపిస్తే నా భార్యని అడుగు ఆమె కోరింది ఆమెకి ఇవ్వు అని అంటాడు.
దానితో ఈ ఉదంకుడు గురుపత్నిని ఎం కావాలో చెప్పు మాత అని అడగగా ఆమె నేను పౌష్యమహారాజు భార్య చెవులకి బంగారు కుండలాల జతను చూశాను అవి ఎంతో అందంగా సుందరంగా ఉన్నాయి వాటి మీద నాకు ఎప్పటి నుంచో ఆశ ఉంది నీ వల్ల అయితే అవి నాకు తెచ్చిపెట్టు నాకు కేవలం నాలుగు రోజులలో అవి కావాలి అని అడుగుతుంది.
సరే అని గురుపత్నికి చెప్పి కుండలాల కోసం చిత్తమనికి బయలుదేరాడు, అలా అడివిలో కొద్దీ దూరం పోయాక దారి మధ్యలో ఎదురుగుండా పెద్ద ఎద్దుమీద ఒక దివ్యమైన వ్యక్తి ఉదంకుడికి కనిపించాడు, వీరి ఇద్దరి మధ్య కొద్దీ సంభాషణ తరువాత ఉదంకుడితో నీవు అనుకున్న కార్యంనెరవేరాలి అంటే నీవు ఈ ఎద్దుపేడను తినాలి ఏది తింటే నీ కార్యాలు పూర్తి అవుతాయి అని చెప్తాడు ఆదివ్యపురుషుడు చెప్పినట్లుగా ఈ ఉదంకుడు ఆ ఎద్దుపేడను తింటాడు
ఆ తరువాత అక్కడినుండి తిన్నగా పౌష్యమహారాజు దగ్గరికి వెళ్లి మహారాజ నీ సహాయం కోసం వచ్చాను నాకు గురుదక్షణ ఇవ్వడానికి మీ భార్య ధరించినా బంగారు కుండలాలు కావాలి అవి నాకు ఇప్పించండి అని వేడుకుంటాడు. దానికి పౌష్యమహారాజు ఉదంకుడితో మీరు మహా జ్ఞానీ విద్యావంతులు పుణ్యాత్ములు మీరు కోరినట్లే ఆ అంతఃపురంలో నా భార్య ఉంది మీరు వెళ్లి ఆమెకి నా మాటగా చెప్పి ఆ కుండలాలను తీసుకోండి అని అంటాడు.
ఉదంకుడు రాణి నివాసానికి వెళ్లి చూశాడు ఎక్కడ ఆమె లేదు తిరిగి వచ్చి పౌష్యమహారాజుతో ఆమె రాణి నివాసంలో లేదు అని చెప్తాడు అప్పుడు పౌష్యుడు అదేమిటి ఆమె అక్కడే ఉంది అని అయితే ఆమె మహా పతివ్రత అని శుచి సుబ్రతా లేని వారికీ ఆమె కనపడడదు మీరు మహాత్ములు ఇది ఎలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఈ ఉదంకుడికి ఆ ఎద్దుపేడ తిన్న విషయం గుర్తుకువచ్చింది.
నేను పేడను తినడం వల్లనే ఆమె కనపడలేదు కావొచ్చి నేను తిన్న తరువాత స్నానం కూడా చేయకుండా ఇక్కడికే వచ్చాను అని తూర్పు దిక్కునా వెళ్లి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని మల్లి అంతఃపురానికి వెళ్ళాడు.
అంతలోనే రాణి ఎదురు వచ్చి నమస్కారం చేసింది అతని కోరిక ప్రకారం చెవుల కుండలాలు ఉదంకుడి చేతిలో పెట్టి వీటి కోసం తక్షకుడు ఎదురుచూస్తున్నాడు ఏ మాత్రం ఏమేర పాటుగా ఉన్న తక్షకుడు ఎత్తుకొని పోతాడు అని చెప్పింది.
సరే అని ఆమెకి చెప్పి పౌష్యమహారాజు దగ్గరికి వెళ్ళగానే రాజు భోజనం చేసి వెళ్ళండి అని మర్యాదగా ఉదంకుడికి భోజనం పెట్టాడు సరిగ్గా తినే ముందే అన్నంలో ఒక చిన్న వెంట్రుక కనపడింది వెంటనే ఉదంకుడికి కోపం వచ్చి శుభ్రత లేని అన్నం నాకు పెడతావా నీకు కాళ్ళు పొయ్యి గుడ్డివాడివి అవుతావు అని శాపం ఇస్తాడు దానికి పౌష్యుడు చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తావా నీకు పిల్లలు పుట్టకుండా పోతారు అని తిరిగి ఉదంకుడికి పౌష్యుడు శాపం ఇస్తాడు.
వెంటనే ఉదంకుడు పిల్లలు లేకుండా ఉండలేను శాపం ఉపసంహరించు అని పౌష్యుడిని అడగగా బ్రాహ్మణులకే ఆ శక్తి ఉంది అని మిరే శాపం ఉపసంహరించండి అని అంటాడు దానికి నీకు కళ్ళు తొందరలోనే వస్తాయి అని చెప్తాడు. శాపాన్ని ఉపశమనం ఉంది అని కుదరపడి కుండలాలు పట్టుకొని తిరుగుముఖం పట్టాడు.
దారి మధ్యలో మంచినీళ్ల సరస్సు కనపడింది నీరు తాగడానికి ఒడ్డునే కుండలాలు పెట్టి నీళ్ళలోకి వెళ్ళాడు కానీ చాలా సమయం నుంచి ఒక దిగంబరమైన వ్యక్తి ఇతడి వెనకాలే వచ్చి నీళ్ళలోకి దిగినా సమయమే అనువైనదని ఆ కుండలాలు పట్టుకొని వెళ్తున్నాడు.
Moral stories in telugu
అతడిని చూసి ఈ ఉదంకుడు డేగ లగా పరుగు పెట్టి ఆ దిగంభర వ్యక్తిని పట్టుకున్నాడు కానీ అతను మాయమై ఒక పాము రూపంలో కుండలాలు పట్టుకొని పుట్టలోకి దూరాడు ఆ పుట్టనుంచే నాగలోకం వెళ్ళిపోయాడు. ఇక ఈ ఉదంకుడు వచ్చింది తక్షకుడని గ్రహించి ఆ పుట్టలోకి ఉదంకుడు దూరి తక్షకుడిని వెతికాడు
కానీ ఎక్కడ కూడా ఉదంకుడికి తక్షకుడు కనపడలేదు చేసేదేమిలేక అక్కడ ఉన్న నాగరాజులని ప్రార్ధించాడు. ఆదిశేషుడని కొండలు, వానలు, నదులు, సరస్సులు సముద్రాలూ, ఇన్నింటిలోను వెయ్యిపాడగలతో భూమండలాన్ని మోస్తున్నావు నన్ను కరుణించు అని వేడుకున్నాడు, రాక్షస బాధలే లేకుండా ఈ నాగలోకాన్ని ఒక రక్షరేకులాగా కాపాడావు తపశ్శాలివి..
దేవతలు, రాక్షసులు పాదాభివందనం చేసే ఆ పరమశివువుడికే కంఠం మీద ఆభరణంలా ఉన్న ఓ సర్ప రాజా వాసుకి అన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు.
కోటానుకోట్ల నాగరాజులారా నన్ను అనుగ్రహించండి కురుపర్వతలా మందిరాలలో అశ్వసేనుడితో స్వేచ్చావిహారం చేస్తూ పరాక్రమవంతుడివి, శూరుడివి ఓ తక్షక నన్ను అనుగ్రహించు అని ఉదంకుడు నానా రకాలా మాటలతో వేడుకున్నాడు.
Moral stories in telugu
ఇలా సోత్రం చేస్తున్న సమయాలలో ఒక చిత్రమైన దృశ్యం కనపడింది ఇద్దరు ఆడవారు తెలుపు నలుపు దారాలు వేస్తూ బట్టలు నేస్తున్నారు పక్కనే మరో ఆరుగురు కుమారులు పన్నెండు రేకుల చక్రం తిప్పుతున్నారు. దాని తరువాత ఒక పెద్ద గుర్రం దాని మీద ఒక దివ్యమైన వ్యక్తి ధగధగా మెరిసిపోతూ ఉదంకుడికి కనిపించాడు,
వెంటనేఉదంకుడుఆదివ్యపురుషుడినిమంచిమంత్రాలతోసోత్రాలుచేశాడుదానికిపరవశించిపోయినాఆదివ్యపురుషుడుఉదంకుడినినీకుఎంకావాలోచెప్పునీసోత్రాలకినాకుఆనందంకలిగిందిఅంటాడుదానికిఈఉదంకుడుఈనాగలోకంఅంతనావశంకావాలిఅనిఅడుగుతాడు
ఆ దివ్యపురుష్యుడు అయితే ఆ గుర్రం చెవులో ఉదమని చెపుతాడు ఈ ఉదంకుడు గుర్రం దగ్గరకు పోయి చెవులో ఊదుతాడు వెంటనే గుర్రం నవరంద్రాల నుండి అగ్ని జ్వాలలు రావడం మొదలు పెట్టాయి
ఆ అగ్ని నాగలోకం మొత్తం సందుసందునా మూలములనా వ్యాపిస్తూ దహిస్తూ ఉంది పాములు అన్ని భయబ్రాంతులయ్యాయి తక్షకుడు గజగజ వణికిపోయాడు ప్రళయకాలం వచ్చినట్లు ఉంది ఆ అగ్ని వెంటనే ఉదంకుడి కోపం వల్ల ఈ అగ్ని వస్తుందేమో అని తక్షకుడు తక్షణమే ఉదంకుడి దగ్గరకు వెళ్లి బంగారు కుండలాలు తన చేతులో పెట్టి దండం పెట్టాడు.
కుండలాలు చేతికి వొచ్చాయి కాని పాతాళలోకం నుండి ఎలా బయటపడాలో తెలియడంలేదు ఈ ఉదంకుడికి వెంటనే ఈ దివ్యపురుష్యుడు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు అధైర్య పడకు ఇదిగో ఈ గుర్రం కూర్చో గాలికంటె, మనసు కంటే, వేగంగా ఇది ప్రయాణిస్తుంది కనురెప్ప కాలంలో నీవు అనుకున్న ప్రదేశంలోకి నీవు వెళ్ళగలవు అని చెప్తాడు.
ఇక ఈ ఉదంకుడు బతికిపోయాను అంటూ ఆ గుర్రం మీద కూర్చుని ఎన్నుమూసి తెరిచే లోగా తన గురువు గారైనా పైలముని ఇంటి ముందు విడిచిపెట్టింది ఈ గుర్రం అప్పటికే సూచి స్నానం పూర్తి చేసినా గురుపత్ని ఈ కుండలాల కోసమే కనిపెట్టుకొని కాచుకొని కూర్చుంది ఈ ఉదంకుడు వెళ్లి కుండలాలు ఆమె చేతిలో పెట్టి నమస్కారం చేశాడు.
Moral stories in telugu
వెంటనే ఏమోయ్ ఇదిగో అన్నంత దగ్గరలో పౌష్యమహారాజు ఊరు ఉంటె నివేంటి ఇంత ఆలస్యం చేసావు అని గురువు అయినా పైలముని అడుగుతాడు.
అవును గురుదేవ ఆలస్యమే అయ్యిందని ఉదంకుడు జరిగింది మొత్తం చెప్పుతున్నాడు దార్లో ఒక దివ్య పురుషుడు కనపడడమేమిటి ఎద్దుపేడ తినడం ఏమిటి నాగలోకంలో పెద్ద గుర్రం ఏమిటి, అందులో దివ్యపురుష్యుడు ఏమిటి, అసలు ఆడవారు ఎవరు, తెలుపు నలుపు దారాల వస్త్రాలు ఏమిటి ఆరుగురు కుమారులు ఏమిటి, చక్రం ఏమిటి ఇదంతా అయోమయంగా ఉంది నాకు గురుదేవా అని చెప్తాడు.
వెంటనే పైలముని అదృష్టవంతుడివి ఉధంగా నీకు ఎద్దు మీద కనపడింది దేవేంద్రుడు ఎద్దు ఒక ఐరావతం, పేడ పేడ అంటున్నవ్ అది నిజానికి పేడ కాదు అది అమృతం నీవు ఇంద్ర దర్శనం చేసి అమృతం సేవించావు.
అందుకే ఏ అడ్డు లేకుండా కుండలాలు సాధించావు అంతే కాదు పాతాళలోకంలో ఆడవారు ఇద్దరు ధాతా విధాతలు ఇక తెలుపు నలుపు ధారలు పగలు రాత్రి వస్త్రం ఒక రోజును చూపించింది. చక్రం ఒక సంవత్సరం రేకులు పనేండు మాసాలు ఆరుగురు కుమారులు ఆరు రుతువులు గుర్రం అగ్నిహోత్రుడు గుర్రం మీద దివ్య పురుష్యుడు ఇంద్రుడి మిత్రుడు మేఘుడు నీ గురువు భక్తే నిన్ను ఇంత వాడిని చేసింది.
మహా సంతోషముగా ఉంది నాకు కోరినా కుండలాలు తెచ్చావు గురువు ఋణం తీర్చుకున్నావు ఇకనైనా వెళ్లి ఒక ఇంటివాడివై సుఖపడు అని పైలముని ఉదంకుడితో అన్నాడు.
గురువుకి నమస్కరించి వెళ్ళాడు అంత బానే ఉంది కానీ తక్షకుడు దిగంబరుడై వచ్చినా మోసాన్ని మాత్రం మర్చిపోలేదు ఎన్నో సంవత్సరాల కాలం పాటు తపస్సు చేసినా అది పోలేదు ఎలాగైనా వాడికి బుద్ది చెప్పాలని అలోచించి నేరుగా జనమేజయుని దగ్గరికి వెళ్లి పరీక్షిత్ చనిపోవడానికి తక్షకుడే కారణమని నీవు ఎలాగైనా తక్షకుడిని చంపాలని దానికి ఒకేఒక్క మార్గం సర్పయాగం అని చెప్పాడు
నేను మా గురుపత్నికి కుండలాలు తెస్తుంటే నన్ను మోసం చేసాడు అందుకే నీ దగ్గరకు వచ్చాను అని వాడు పెద్ద మోసగాడని ఉదంకుడు చెప్పాడు ఆదేవిందంగా ఉదంకుడు చెప్పినట్లు జనమేజయుడు సర్పయాగం చేసి సర్పజాతిని నాశనం చేశాడు ధన్యవాదాలు.