ధన త్రయోదశి Telugu stories
ధన త్రయోదశి రోజున అసలు ఏమదిపాలు ఎందుకు పెడతారో తెలుసా? ఏమదిపాల వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం హిమ అనే ఒక రాజు ఉండేవాడు అతడికి చాలా సంవత్సరాల కాలం వరకు పిల్లలు లేరు లేక లేక ఒక కుమారుడు కొన్ని సంవత్సరాలకి పుట్టాడు
కానీ పుట్టిన వెంటనే అతని జాతకం చూసిన పురోహితులు అతడికి వివాహం జరిగిన నాలుగో రోజునే చనిపోతాడని రాజుకు చెపుతారు ఆ మాట వినగానే లేకలేక కలిగిన సంతానానికి మరణ గండమని తీవ్రంగా దుఃఖించాడు నా కుమారుడు బ్రతికుంటే చాలు అని అతడికి పెళ్లి చేయనని అనుకుంటాడు.
ఇక రాజకుమారుడు పెరిగి పెద్దయి పెళ్లి వయసుకు వచ్చాడు అయితే ఈరాజకుమారుడిని ఒక రాజకుమారి ప్రేమిస్తుంది వారి వివాహానికి హిమరాజు దగ్గరికి వెళితే ఈ హిమరాజు వివాహానికి నేను ఒప్పుకోను అని నా కొడుకుకి ప్రాణగండం ఉంది అని చెప్తాడు.
ఎన్ని విధాలుగా ఈ హిమరాజు రాజకుమారుడికి రాజకుమారికి చెప్పినా వారు వినకుండా వివాహం చేసుకొని ఇంటికి వస్తారు. ఇక చేసేదేమీ లేక హిమరాజు నా కొడుకుకి ప్రాణగండం ఉంది అని బాధ్యత నీదే అని కోడలికి చెప్తాడు ఆ రాజకుమారికి ఎందుకో మనసులో చాలా భయం కలిగింది.
ఎలాగైనా నా భర్త ప్రాణాలు కాపాడుకోవాలని లక్ష్మీదేవికి పూజిస్తుంది అయితే రాజకుమారుడికి రాజకుమారికి వివాహం జరిగిన నాలుగో రోజే అశ్వయుజ బహుళ త్రయోదశి ఆ రోజున లక్ష్మీదేవి క్షీరసాగర మొదల నుండి పుట్టారు కాబట్టి అమ్మకు పూజ చేసి నా భర్త ప్రాణాలు కాపాడుకుంటానని ఆరోజు ఆ రాజకుమారి గది ముందు బంగారు నగలు ఇతర ఆభరణాలను రాశులుగా పోసింది పూజ గదిలో వెలిగించింది రాజమందిరం అంతా ప్రతి చోట దీపాలు పెట్టింది.
Telugu stories II mythology stories
బంగారం అంతా రాశులుగా పోయడం వల్ల ఆ ద్వీపాలకఅంతికి మొత్తం రాజ మందిరం అంతా వెలిగిపోతుంది సౌభాగ్య దేవిగా లక్ష్మీదేవికి ఆ రోజు అంతా నిష్టతో పూజ చేసి ఆరాధిస్తుంది ఇక ఆ సమయంలోనే రాజకుమారుడి ప్రాణాలు హరించేందుకు యమధర్మరాజు ఒక పామురూపంలో రాజమండ్రిలోకి వచ్చాడు కానీ ఓ పక్కదీపాల వెలుగులు మరో పక్క దగదగా మెరిసిపోతున్న బంగారునగలకుప్ప దీపకాంతి దాని వల్ల యముడికి కళ్ళు కనిపించలేదు ఎంత చూసినా కళ్ళు మొత్తం మసకమసగగ కనిపిస్తున్నాయి
ఇక యమధర్మరాజు తన నిజమైన రూపంలోకి వచ్చి గుమ్మం ముందు నిలుచున్నాడు అయినా తన కళ్ళు దీపకాంతలకి మసకబారే ఉన్నాయి మరోపక్క ఈ రాజకుమారి లక్ష్మీదేవికి పూజ చేస్తూ తనని ఆరాధిస్తూ మధురమైన పాటలు పాడుతుంది ఆ పాటలకు కొద్ది సమయం వరకు యమధర్మరాజు లక్ష్మీదేవిని మనసులో నిలుపుకొని నమస్కారాలు చేస్తూ మైమరిచిపోయాడు
దానితో యమ గడియలు ముగియడంతో ఆ రాజకుమారుడి ప్రాణాలు తీయలేకపోయేసరికి ఆ రాజకుమారిని మెచ్చుకుంటూ యమలోకానికి వెళ్ళిపోయాడు దాని కారణంగా అశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధించి ఇంటి గుమ్మం ముందు ఏమదిపాలు పెడతారో వారిని యమధర్మరాజు కారు నుంచి అకాల మృత్యు బాధలు తొలగిస్తాడని నమ్ముతూ ఉంటారు
కుబేరుని పూర్వజన్మల గురించి శ్రీ శివ పురాణంలో, సూత మహర్షి శౌనకాది మునులకి చెప్పిన ప్రకారం, పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు – సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేద, వేదాంగాలు, శాస్త్ర, పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు, రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి.
అతను చెడు సావాసాల వలన జూదానికి బానిసయ్యి, ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లయిన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా, గారాబంతో మందలించకపోగా, భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో, మౌనం వహించేది.
యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్య కలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునే వాడు కాదు. ఎప్పుడయినా కొడుకు గురించి భార్యను వాకబు చేస్తే, ఆవిడ పుత్ర ప్రేమతో, చదువుకోడానికి గురువుగారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్య పెట్టేది. దానితో గుణనిధికి అడ్డు, అదుపు లేక, ఇంటిలో నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు
ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంట పడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోటమాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నదీ తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ, భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్లి, కొడుకు చెడు సావాసాలకు లోనయిన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు.
ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేక పోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తల దాచుకోవటానికి సహకరించలేదు. ప్రక్కనే ఉన్న గౌతమీనది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, తమ శక్తి కొలదీ జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు.
భక్తులంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక, ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భ గుడిలోనికి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక, తన పైవస్త్రాన్ని చించి వత్తిగా చేసి, అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకి నడుస్తుండగా, గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి, నందీశ్వరుని మీద పడి, తల పగిలి చనిపోతాడు.
ఊరి నుండి పారిపోతూ పవిత్రమయిన గౌతమీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. ఆ తరువాత జన్మలో, గుణనిధియే, విశ్రవునికీ, , భరద్వాజ మహర్షి కుమార్తె అయిన దేవవర్ణికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే కుబేరుడు.
ఒకరోజు ఇంద్రుడు ఐరావతం పైన ఎక్కి ఆకాశమార్గంలో స్వర్గానికి వెళుతుండగా పైనుంచి వెళ్తున్న ఇంద్రుడిని క్రింద ఉన్న దుర్వాస మహర్షి చూశాడు. చూడగానే అమరావతికి అధిపతి అని గౌరవంగా ఇంద్రుడిని పిలిచి తన మెడలో దండను తీసి ఇస్తాడు, కాని అప్పటికే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు అసలు దండ ఇచ్చినది ఎవరో కూడా చూడకుండా అతనిని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు కూడా తెలియచేయకుండా ఆ దండని తీసుకొని ఏనుగు తొండానికి తగిలిస్తాడు.
ఇక ఆ ఏనుగు తొండం మీద ఉన్న దండను అటు ఇటు కదిలిస్తూ ఆ దండను ఏనుగు కాళ్ళ క్రింద విసిరేసి కాలితో తొక్కుతుంది. దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ ఆ దండను అలా చూడగానే విపరీతమైన కోపం వచ్చి ఓ ఇంద్ర మితిమీరినా ని అహంకారం గర్వంతో ప్రవర్తించినా ని ఈ పనికి ని భోగభాగ్యాలు సిరిసంపదలు మొత్తం పోతాయి అని శపిస్తాడు.
శాపం తగలడంతో ఇంద్రుడు తప్పు తెలుసుకొని నన్ను క్షేమించండి అని దుర్వాస మహర్షిని వేడుకుంటాడు దానికి దుర్వాస మహర్షి శాపం వెన్నక్కి తీసుకోవడం జరగదు ఈ శాపం నువ్వు అనుభవించక తప్పదు కానీ విష్ణుమూర్తి వాళ్ళ నీవు కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందగలవు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఇంద్రుడిపైన దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం పనిచెయ్యడం మొదలైంది. బలి నాయకత్వంలోని రాక్షసుల సైన్యం అంత అమరావతి అంటే ఇంద్రలోకం పైన దాడిచేయడం ప్రారంభించారు.
ఆ దాడిలో ఇంద్రుడిని వారి పరివారం మొత్తాన్ని స్వర్గం నుండి తరిమేస్తారు. ఇక తప్పని పరిస్థితులలో ఎవరికీ కనపడకుండా అజ్ఞాతంలోకి ఇంద్రుడు వెళ్ళిపోతాడు.
ఒకరోజు తన గురువు అయినా బృహస్పతి దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం వివరిస్తాడు. దానికి బృహస్పతి ఈ సమస్యకి పరిస్కారం బ్రహ్మను అడుగుతాము అని సలహా ఇస్తాడు. వెంటనే బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళి ఉపాయం చెప్పమనగా దీనికి సమాధానం శివుడు ఇస్తాడు అని బ్రహ్మ చెప్తాడు. శివుడి దగ్గరికి ఇంద్రుడు వెళ్ళి స్వరగానికి అధికారం కోసం పరిస్కారం చెప్పమనగా దీనికి సమాధానం విష్ణుమూర్తి ఇస్తాడని శివుడు చెప్తాడు
ఇక ఇంద్రుడు విష్ణుమూర్తికి తన భాద చెప్పుకోగా విష్ణుమూర్తి ఇంద్రుడితో పదవి నీకు దక్కాలి అంటే అమృతం కావాలని చెప్తాడు అమృతం వల్ల మృత్యువు రాదని అమృతం లభించాలి అంటే మందరపర్వతంతో సముద్రాన్ని పలుచిలికినట్టు చిలికి అమృతాన్ని బయటకు తీయాలని అలాగే ఈ పని చెయ్యడం దేవతల ఒక్కరి వల్ల సాధ్యం కాదని దీనికి రాక్షషుల సహాయం కూడా కావాలని చెప్తాడు.
క్షీరసాగర మధనం గురించి మరొక వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మంధర పర్వతం సహాయంతో వాసుకి తాడుగా ఉండి పర్వతం మునిగిపోకుండా విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉంది పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు. ఈ మధనంలో ఎన్నెనో విలువైన వస్తువులు కల్పవృక్షం కామధేనువు చంద్రుడు హాలాహలం అలాగే మహాలక్ష్మి జన్మించారు.
అయితే మహాలక్ష్మి పాలసముద్రపు మీద మీగడతో బ్రహ్మ లక్ష్మీదేవి శరీరాన్ని చేసాడట.. క్రొమ్మెఘపు మెరుపులు ఆమె మెను మెరుగుగా కుర్చాడట… మహాలక్ష్మి పుట్టగానే ఆమెకి మంగళ స్నానం చేయించారు సముద్రుడు ఆమెకు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు. విశ్వకర్మ సువర్ణ అలంకారాలు ఇస్తాడు.
మహాలక్ష్మి వైపే ఓర చూపుతో చూస్తున్న విష్ణువునీ లక్ష్మీదేవి చూసి విష్ణువు పక్కకు చేరి దేవదానవులలో మీ ఎవ్వరితో నేను చేరినా నాకు సుఖం ఉండదు. శ్రీ మహావిష్ణువు చెంత ఉంటేనే నేను నిత్యం సుమంగళిగా ఉంటాను అని చెప్పి మహావిష్ణువు మేడలో పూల మాల వేసింది. అప్పుడు సముద్రుడు కౌస్తుభమణిని అంటే అమూల్యమైన మాణిక్యం తీసుకొని విష్ణువుకి ఇస్తాడు.
ఇక విష్ణుమూర్తి ఆ కౌస్తుభమణితో పాటు మహాలక్ష్మిని తన వక్ష స్థలంపై విరాజిల్లచేసాడు. అప్పటి నుండి మహాలక్ష్మి విష్ణుమూర్తికి ధర్మపత్నిగా మనం కొలుచుకుంటున్నాం.