పరీక్షిత్ మహారాజు Telugu stories
మహాభారత యుద్ధం తరువాత ధర్మరాజు రాజ్యపరిపాలన చేస్తాడు, కొన్ని సంవత్సరాల తరువాత శ్రీకృష్ణుడి అవతారం ముగిసినప్పటి నుండి ద్వాపరయుగం ముగిసిపోయి కలియుగం start అవుతుంది. కలియుగం వచ్చినట్టు ధర్మరాజుకి తన రాజ్యపాలనలో వచ్చిన మార్పుల వల్ల అర్ధమవుతుంది దానితో ఇక నేను రాజ్యం వదిలేసి సన్యాసం తీసుకోవాలని అభిమన్యుడి కొడుకు అయిన విష్ణురాతుడికి పట్టాభిషేకం చేసి పాండవులు సన్యాసం తీస్కుంటారు.
ఇక్కడ విష్ణురాతుడు అంటే పరిక్షిత్ మహారాజు, తల్లి ఉత్తర గర్భంలో ఉన్నపుడు శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం అడ్డువేసినపుడు శ్రీకృషుడి రూపం గర్భంలోనే చూశాడు పుట్టినాక కృష్ణుడి కోసం పరీక్షించి అందరిని చూసేవాడట అందుకని తనకి పరీక్షిత్ అనే పేరు వచ్చింది, ఈ పేరుతోనే తనని పిలుస్తారు
అయితే పరిక్షిత్ మహారాజు ఐరావతిని వివాహం చేసుకొని పాండవులు ఎలా రాజ్యాన్ని పరిపాలించారో అంతే ధర్మంతో పాలించాడని మన అందరికి తెలిసిందే అయితే ఇక్కడ పరీక్షిత్ మరణానికి ఒక కారణం కలిపురుషుడని చాలా తక్కువ మందికి మాత్రంమే తెలుసు శృంగి శాపానికి గురికావడం కలిపురుషుడు వాళ్ళ అది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.
పరీక్షిత్ మహారాజు ఒకరోజు తన రాజ్యపాలన కోసం రాజ్యం మొత్తం తిరుగుతూ వుండగా ఒక చోట విచిత్రంగా ఒక ఆవు ఒక ఎద్దు బలవంతంగా దగ్గరకు రాలేక రాలేక వస్తుండడం గమనించి ఆశ్చర్యంగా ఆ సంఘటనను చూస్తూ నిలబడ్డాడు, విచిత్రం ఏంటి అంటే ఆ ఆవుకి పిల్లలు తప్పిపోయిన తల్లి ఎంత విచారంగా ఉంటుందో అంత బాధలో ఆవు ఉంది. ఇక ఎద్దుకి 3 కాళ్ళు లేకుండా ఒక్క కాలుతో ఉన్న ఆ ఎద్దుని చూసి పరిక్షిత్కి ఏం అర్ధంకాక ఆలా చూస్తూన్నాడు.
కొద్దిసేపటికి ఆవు ఎద్దు దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటున్నాయి, ఎద్దు ఆవుని ఎందుకు అంత విచారంగా ఉన్నావు గోమాత అసలు కారణం ఏంటి నువ్వు నన్ను చూసి నా కాళ్ళను చూసి బాధపడడం లేదు కదా అని అడిగింది. అప్పుడు ఆవు అది కూడా ఒక కారణమే కానీ అది మాత్రమే కాదు నేను సత్గుణాలను ప్రేమించేదానిని అలాంటి సత్ గుణాలకే నిలయం అయినా శ్రీకృష్ణుపరమాత్మడు భూమిని వదిలేశాడు
ఏ రోజు అయితే పరమాత్మ భూమిని వదిలి వెళ్ళాడో అప్పటినుండి కలిపురుషుడు దృష్టికిలోనై పాపంతో ఈ భూమి నిండుతుంది అని దానికోసం బాధపడుతున్న అని ఆవు ఎద్దుకి చెప్తూ ఏడుస్తుంది.
అలా అవి మాట్లాడుతుండగా ఎక్కడినుండో ఒకడు వచ్చాడు వాడిని చూస్తే నాలుగురోజులు భోజనం కూడా చెయ్యబుద్దికాదు. అంటే సంస్కారం లేదు, స్నానం అనేది వాడికి తెలియదు అది కాగా ఎంత కోపంతో ఉన్నడాంటే అసలు శాంతి అంటే ఏమిటో కూడా తనకు తెలియకుండా ఉన్న వ్యక్తి కోపంతో రగిలిపోతూన్నాడు.
అతడు sudden గా వచ్చి కారణమే లేకుండా ఎద్దుని కొడుతున్నాడు ఎద్దుకు ఉన్నది ఒక్కటే కాలు దాని మీదనే పదేపదే కొడుతున్నాడు పక్కనే ఉన్న ఆవుని తన కాలుతో తన్ని కళ్ళకింద పడేసి తొక్కుతున్నాడు. ఇది అంత పరీక్షిత్ మహారాజు చూస్తూ కోపంతో తన దగ్గరకు వచ్చాడు. అతడే కలిపురుషుడు తాను చూడడానికి అసహ్యంగా ఉన్న కానీ same ఒక రాజు ఎలాగైతే కిరీటం దరిస్తాడో ఈ కలిపురుషుడు కూడా చేతిలో కత్తి, కర్ర తలమీద కిరీటం పెట్టుకున్నాడు.
పరీక్షిత్ అతనిని చూసి నీవు చూడడానికి రాజులాగా కిరీటం ధరించవు కానీ రాజు లక్షణాలు ఏవి నీకు లేవు మూగజీవులను ఏడిపిస్తున్నావు వాటిని ఎందుకు అలా నీవు హింసిస్తున్నావు అని కోపంతో పరీక్షిత్ మహారాజు ఒక దివ్యమైన బాణం తీసి ఎక్కుపెట్టాడు. అల ఎక్కుపెట్టగానే మేఘాలు గర్జిస్తే ఎలా ఉంటుందో అలా శబ్దం వస్తుంది
ఆ దివ్యమైన అస్రాన్ని చుసిన కలిపురుషుడు నేను కలియుగంలో ఉండవలసిన వాడను శివుడే నన్ను ఈ కలియుగానికి పంపాడు, నీవు నన్ను అంతం చేసిన ఈ కలియుగం ఎలా పాలిస్తావు ఈ యుగంలో నా దృష్టి పడవలసి ఉంది అని పరిక్షిత్కు చెపుతాడు.
దానితో నీవు నా రాజ్యంలో ఉండడానికి వీలులేదు అని పరిక్షిత్ అంటాడు అప్పుడు కలిపురుషుడు మరి నీవే నేను ఎక్కడ ఉండాలో నా స్థిర నివాసం ఎక్కడో చెప్పమని అడుగుతాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు నీవు జూదశాలలో, మద్యం సేవించే దగ్గర, వేశ్యాగృహాలలో, హింస జరిగే దగ్గర ఉండమని చెప్తాడు.
ఇవి ఏవి నా నివాసయోగ్యం కాదు ఇంకొకటి చెప్పమని అడుగుతాడు అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆలోచించకుండా వెంటనే బంగారంలో ఉండమంటాడు. సరే అని అక్కడ నుండి కలిపురుషుడు వెళ్ళిపోతాడు.
ఆ తరువాత పరిక్షిత్ ధరించే బంగారంలో కలిపురుషుడు ప్రవేశించి పరీక్షిత్ మీద తన దృష్టిని పెడతాడు ఇక దాని కారణంగానే సహజంగా రాజులూ వేటకి ఏదైనా ప్రమాదం ఉంటేనే వెళ్ళాలి కాని కలిపురుషుడు ప్రభావం వాళ్ళ వేటకి తన కోరికతో వెళతాడు వేట మృగాన్ని వేటాడుతూ శామిక ముని ఆశ్రమానికి చేరాడు.
అక్కడ తపస్సులో ఉన్న మునిని చూసి తన నుంచి తపించుకొచ్చిన మృగమెక్కడ అని అడిగాడు. తపస్సులో లీనమైన శామిక ముని సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్రఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకు సమీపంలో చచ్చిపడి ఉన్న పాముని తీసి శామిక మహర్షి మేడలో వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది అంత కలిప్రభావం వాళ్ళ చేసాడు.
ఇక కొద్దిసేపటికి అక్కడకు శామిక ముని కుమారుడు శృంగి వచ్చి తన తండ్రి మేడలో చచ్చిన పాముని చూసి కోపంతో ఈ పని చేసిన వాడు ఎవడైనా 7 రోజులలో సర్పం వల్లనే మరణిస్తాడు అని శాపం ఇస్తాడు.
అప్పుడు శామిక ముని తపస్సు నుంచి లేచి శృంగి తొందరపాటుకు కుమారుడిని మందలించి చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష వద్దుఅని శామిక ముని పరిక్షిత్ వద్దకు వెళ్లి శృంగి శాపం గురించి వివరించగా పరీక్షిత్ పశ్చాత్తాపంతో బాధపడి పరీక్షిత్ కుమారుడైన జనమేజయుని రాజ్యపాలన అప్పగించి శాపానికి పరిష్కారం కోసం పలువురు మహర్షులను కలిసి ఒక వారంలో మోక్షం వచ్చే మార్గం చెప్పమని వేడుకుంటాడు. అక్కడ వ్యాసుడి కొడుకు అయినా శుకమహర్షి భాగవతం భక్తి, శ్రద్దలతో పారాయణం చేస్తే మోక్షం లభిస్తుంది అని బోధిస్తాడు.
ఆ తరువాత పరీక్షిత్ పాము భయానికి ఒక ఒంటి స్తంభం కట్టి దాని చివర ఒక భవనం కట్టుకొని చుట్టూ కాపలాగా సైనికులను పెట్టుకొని అందులో ఉంటూ భాగవతం పారాయణం చేసాడు. ఇక భాగవతం పూర్తి నాటికీ సర్పాలకు మనిషి రూపం లభిస్తుంది. దానితో తక్షకుడు అనే సర్పం పరిక్షిత్ తినే పండులో దూరి ఎప్పుడైతే పరిక్షిత్ తినడానికి పండ్లు తీస్తాడో అందులో నుండి బయటకు వచ్చి పరిక్షిత్ ని కాటు వేసి చంపేస్తాడు.
Telugu stories
ఇలా కలిపురుషుడు పరిక్షిత్ మరణానికి కారణమై పరీక్షిత్ మరణం తరువాత కలిపురుషుడు ప్రభావం కలియుగంలో విపరీతంగా పెరగడం మొదలయింది.
కొన్ని లెక్కల ప్రకారం కలియుగం దాదాపు 5124 years క్రితం ప్రారంభం అయింది అని అప్పటినుండి ఇప్పటి వరకు ఆ కలిపురుషుడు ప్రభావం మన మీద పడుతూనే ఉంది అని చెప్పుకోవాలి. ఇక తండ్రి మరణించగానే జనమేజయుడుకి తక్షకుడే తండ్రి మరణానికి కారణమని తెలుసుకొని సర్పములపైనా కోపంతో సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి సర్పయాగం ప్రారంభం చేశాడు అప్పుడు ఆ యాగంలో ఎంతో విషం కలిగిన పాములు కొన్ని వేల కోట్ల మరణించాయి ఆ యాగం కారణంగానే ఇప్పుడు పాములు తక్కువగా ఉన్నాయి.
సర్పయాగం గురించి తెలుసుకున్న వ్యాసమహర్షి మిగితా ఋషులతో కలిసి జనమేజయుడుకి ఒక విషయం చెప్పారు, అది తక్షకుడి శాపం నెరవేరడానికి ఒక కారణం ఉందని అది పాండవులు ఇంద్రప్రస్తవానికి వెళ్ళినపుడు అక్కడ నివసించే తక్షకుడు పాములన్నింటికీ అధిపతి పాండవుల వల్ల తక్షకుడి స్వేచ్ఛను స్వాధీనం చేసుకున్నారు భావించాడు, దాని కారణంగా కోపంతో పాండవులు వారి ప్రజలపైన దాడి చేశాడు ఆ దాడిలో పాండవులు, ద్రౌపతి తప్ప అందరు మరణించారు.
అది చూసి అర్జునుడు తన బాణాలతో నాగలోకానికి నిప్పుపెట్టాడు, అప్పుడు తక్షకుడు మరింత కోపంతో పాండవుల వంశంలో ఒకరిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు దాని కారణంగా అలాగే ఋషి శామిక కుమారుడు శృంగి శాపం కారణంగా పరీక్షిత్ పాముకాటుతో చనిపోయాడు అని జనమేజయుడికి clear గా చెపుతాడు. శాపం కారణంగా నువ్వు సర్పాలన్నిటిని చంపకూడదు అని ఇది మీ వంశానికి చేడుగా అవుతుందని వ్యాసుడు జనమేజయుడితో చెప్తాడు. దానితో సర్పయాగాన్ని ముగిస్తాడు జనమేజయుడు.