ఉలిపి అర్జునుల ప్రేమ కథ Telugu Stories
ఇప్పుడు నేను చెప్పే ఈ కథ మహాభారతంలోని ఆదిపర్వంలో కనిపిస్తుంది, అయితే మహాభారతంలో ఏ చిన్న సన్నివేశం అయినా అది మనకు ఎంతో inspiration లాగా ఉంటుంది అయినప్పటికీ ఈ కథ మాత్రం మనము ఎక్కడ వినడం కానీ చదవడం కానీ జరగదు చాలా తక్కువ మందికి మాత్రమే ఈ ప్రేమ కథ తెలుస్తుంది. ఆ కథనే ఉలిపి అర్జునుల ప్రేమ కథ. ఇక కథలోకి వెళ్తే…
నాగలోకానికి రాజు అయినా కౌరవ్య నాగరాజు కూతురు ఉలిపి. ఈమెని చాలా పేర్లతో పిలుస్తుంటారు. అయినప్పటికీ ప్రధానమైన పేరు మాత్రం ఉలిపినే ఈ కౌరవ్య నాగరాజు గంగానది నీటి అడుగు భాగానా పాతాళలోకంలో నాగలోకాన్ని పరిపాలించాడు. ఈయన కుమార్తె అయినా ఉలిపి సగం మనిషి లాగా సగం పాము లాగా ఉంటుంది.
ఉలిపి చాలా అందంగా ఉంటుంది. ఈ ఉలిపి చుట్టూ నాగకన్యలు చెలికతెలుగా ఎప్పుడు ఆమె వెంటనే ఉంటారు. ఆ చెలికతేలు అర్జునుడి పరాక్రమం విని నిత్యం అర్జునుడి మీద పాటలు పడుతూ ఉండేవారు. అది విన్న ఉలిపి మెల్లగా అర్జునుడి మీద ప్రేమ పెంచుకుంది. ఇక అర్జునుడి విషయానికి వస్తే..
పాండవులలో ఎవరైనా ద్రౌపతితో ఏకాంతంలో ఉంటె మిగిలిన వారు ఆ వైపుకి వెళ్లకూడదనే నియమం వారికివారే విదించుకుంటారు. ఒకవేళ ఏ కారణంగానైనా ఆ నియమాన్ని దాటితే ఆ పాపానికి పరిహారంగా వారు భూప్రదక్షణ చేసిరావాలిసి ఉంటుందనే నియమం పెట్టుకున్నారు. అయితే ఒకరోజు ద్రౌపతి ధర్మరాజు ఏకాంత సమయంలో తక్షకుడు ఇంద్రప్రస్థావన గోవులపే ఆక్రమణ జరుపగా వాటిని రక్షించడానికై అర్జునుడు తన అన్నగారి గదిలో ఉన్న తన ధనస్సు కోసం ద్రౌపతి ఉన్న సమయంలో వెళతాడు.
దాని కారణంగా అర్జునుడు భూప్రదక్షణ చేయవలసి వచ్చింది. అలా అర్జునుడు భూప్రదక్షణలో తీర్ధయాత్రలు చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు గంగానది దగ్గరికి వెళ్లి గంగామాతను స్మరించుకుని అక్కడే ఒకరోజు గడపాలనుకొని గంగానదిలో స్నానం చేస్తూ గంగాదేవిని మొక్కుకుంటుండు.….
అదే సమయంలో పాతలోకంలోని సర్పరాణి అయినా ఉలిపి, తన స్నేహితులతో కలిసి ఈతకొడుతూ, జలవిహారంలో అటుగా వస్తోంది. గంగానదిలో స్నానం చేస్తున్న అర్జునుడిని చూసి అతని అందాన్నికి మొదటిచూపులోనే ప్రేమలో పడుతుంది. ఈ ఉలిపి అర్జునుడి దగ్గరికి వెళ్లి తనని వివాహం చేసుకోమని అడుగుతుంది దానికి అర్జునుడు తన భార్య ద్రౌపతి కోసం నేను బ్రహ్మచర్యం తీసుకొని తీర్థయాత్రలు చేస్తున్నానని నిన్ను వివాహం చేసుకోలేను అని ఉలిపికి చెప్పి ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు.
ఆ తరువాత గంగాతీరాన విశ్రాంతి తీసుకుంటున్న అర్జునుడిని, ఉలిపి తన స్నేహితులతో కలిసి అర్జునుడి కళ్ళు చేతులు బందించి నాగలోకానికి లాక్కొనిపోతారు.
ఈ అర్జునుడు కళ్ళు తెరిచి చూడగానే నాగలోకం కనిపిస్తుంది అది చూసి అర్జునుడు ఆశ్చర్యపోయి నేను ఎక్కడ ఉన్నానని చుట్టూ చూస్తున్నాడు, అప్పుడు మళ్లి ఉలిపి వచ్చి నన్ను వివాహం చేసుకోమని అడుగుతుంది, అర్జునుడు ఎన్ని విధాలుగా చెప్పిన ఆమె వినదు, ఆమెని వివాహం చేసుకోపోతే నేను ప్రాణత్యాగం చేస్తానని అంటుంది. ఈ ఉలిపి అర్జునుడిని తీసుకొని పోయి కౌరవ్య నాగరాజుకి పరిచయం చేస్తుంది. నాగరాజుకి ఉలిపి ప్రేమ నచ్చదు.
దానితో అర్జునుడి మీద కోపంతో అర్జునుడిని చంపడానికి నరక జ్వాలలు ప్రయోగిస్తాడు. ఆ నరకజ్వాలల నుండి ఉలిపి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అర్జునుడిని కాపాడుతుంది. ఆ తరువాత అర్జునుడి పరాక్రమం తెలుసుకున్నా కౌరవ్య నాగరాజు తన కుమార్తె అయినా ఉలిపిని వివాహం చేసుకోమంటాడు. ఉలిపి ప్రేమకు ముగ్ధుడైన అర్జునుడు ఉలిపిని వివాహం చేసుకుంటాడు, వివాహం అయినా వెంటనే వారు ఇరాన్ అనే కుమారుడికి జన్మనిస్తారు……
ఆ తరువాత అర్జునుడు నేను వెళ్లే సమయం అయిందని నా భూప్రదక్షణ ఇంకా పూర్తి కాలేదని నాతో వచ్చిన నా మిత్రులంతా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక నేను వెళ్ళాలి అని ఉలిపిని ఒప్పించి వెళతాడు వెళ్లే ముందు ఈ ఉలిపి అర్జునుడికి ఒక వరం ఇస్తుంది. అది నీటిలో నివసించే ఏ జంతువైనాసరే అర్జునుడికి కట్టుబడి ఉంటాయి అని అలాగే నీటిలో కూడా నువ్వు అజేయుడిగా ఉంటావు అని వరం ఇస్తుంది. ఇక అర్జునుడు వెళ్లిన తరువాత ఉలిపి అర్జునుడిని తలుచుకుంటూ బ్రతుకుతుంది.….
telugu stories
కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ఒకరోజు ఉలిపి స్నానం చేద్దామని ఆకాశగంగా దగ్గరికి వెళుతుంది. అక్కడికి వసువులంతా వచ్చి ఒక రేవులో స్నానం చేస్తున్నారు అంతలో అక్కడికి గంగాదేవి పత్యేక్షమవుతుంది. అప్పుడు వసువులు గంగాదేవితో తల్లి,…. శిఖండిని అడ్డు పెట్టుకొని అర్జునుడు, బీష్ముడిని వాదించాడు అది మహాపాపం కదా అని అంటారు.
దీనికి కోపంతో గంగాదేవి కన్నకొడుకు చేతిలోనే అర్జునుడు చనిపోతాడు అని శాపం ఇచ్చింది. ఇది విన్న ఉలిపి వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది, దానితో గంగాదేవిని కౌరవ్య నాగరాజు ప్రార్ధించి తన అల్లుడిని కనికరించామని అడుగుతాడు, అప్పుడు గంగాదేవి అర్జునుడు తన కొడుకు చేతిలో చనిపోయిన నాగలోకంలోని మృతసంజీవనీ మణి వల్ల మల్లి పునర్జీవుడు అవుతాడని ఉపాయం చెప్తుంది.
కొన్ని రోజులకి ధర్మరాజు తన రాజ్య విస్తారం కోసం అశ్వమేధ యాగం చేస్తాడు అశ్వం వెంట అర్జునుడి వెళ్లగా దరి మధ్యలో తన కొడుకు అయినా బాబ్రావాహనుడు ఎదురొచ్చి స్వాగతం పలికిన, అర్జునుడు పట్టించుకోకుండా అవమానిస్తాడు. ఇక కోపంగా భాబ్రవాహనుడిని నాకు అడ్డు తప్పుకో అని అంటాడు, తండ్రి మాటలకూ చాలా బాధ పడి అర్జునుడికి భాబ్రవాహనుడు దారి ఇస్తాడు. అదిగమనించినఉలిపిబాబ్రావాహనుడిదగ్గరికివెళ్లి
నేను నీకు అమ్మను అవుతానని చెప్పి నీ తండ్రితో యుద్ధం చెయ్యి ఇలా పిరికి వాడిలాగా నిలబడితే నీ త్రండ్రికి నచ్చదని చెప్తుంది. దానితో భాబ్రవాహనుడు త్రండ్రిని యుద్దానికి పిలిచి గోరమైన యుద్ధం చేస్తాడు.
ఇక ఆ యుద్ధంలో అర్జునుడు బాబ్రావాహనుడి చేతిలో చనిపోతాడు దానితో ఉలిపి నాగలోకం లోని మృతసంజీవనీ మణి తో అర్జునుడిని పునర్జీవుడిని చేస్తోంది. ఆ తరువాత ఉలిపి అర్జునుడికి తన భార్య అయినా చిత్రాంగదకు అలాగే చిత్రాంగద కుమారుడు బాబ్రావాహనుడికి అర్జునుడి శాపం గురించి వివరిస్తుంది…….
దానికి అర్జునుడు మన వంశానికి పాపం తగలకుండా కాపాడినందుకు ఉలిపిని మెచ్చుకొని, అర్జునుడు, బాబ్రావాహనుడిని చిత్రాంగదను ఆశీర్వదించి తిరిగి హస్తినాపురానికి వస్తాడు. ఇలా భర్త ప్రాణాన్ని కాపాడుకుంది ఉలిపి…..ధన్యవాదాలు.